Skip to Content

విశ్వసనీయ అనుచరుడు క్రీస్తు హతసాక్షి : జెబెదయి కుమారుడైన యాకోబు | James, Son of Zebedee: Embracing Faithfulness and Martyrdom for Christ

  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: 40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
  • Reference: Sajeeva Vahini

40 Days - Day 2విశ్వసనీయ అనుచరుడు క్రీస్తు హతసాక్షి : జెబెదయి కుమారుడైన యాకోబు

జెబెదయి కుమారుడైన యాకోబుయేసు యొక్క అత్యంత విశ్వసనీయ అనుచరులలో ఒకడిగా లెక్కించబడ్డాడు. పేతురు మరియు యోహానులతో కలిసి తానూ కూడా ఒక ప్రత్యేకించబడిన శిష్యునిగా, గొప్ప శ్రమల ద్వారా పరీక్షించబడే సమయాల్లో, క్రీస్తుతో ప్రయాణాన్ని ప్రారంభించాడు. యేసు యొక్క అద్భుత కార్యాలు లోతైన బోధనలను గురించి, అలాగే అతని రూపాంతరం గురించి సాక్ష్యమిచ్చాడు యాకోబు, ఇవన్నీ అతని విశ్వాసాన్ని బలపరిచాయి అనుటలో ఎట్టి సందేహం లేదు.

యేసుకు సన్నిహితంగా ఉన్నప్పటికీ, మిగిలిన శిష్యుల మాదిరిగానే, యాకోబు - సందేహం మరియు దుర్బలత్వానికి అతీతుడు కాదు. అయినప్పటికీ, క్రీస్తు యొక్క అడుగుజాడల్లో, ప్రత్యేకంగా దేవుని రాజ్య స్థాపన విషయాలలో అవగాహనను పెంచుకున్నాడు. వినయం, సేవ మరియు నిస్వార్థ ప్రేమ ఈ మూడు ప్రాముఖ్యమైన  విలువలను నేర్చుకున్నాడు - యేసు యొక్క నమ్మకమైన అనుచరుడికి అవసరమైన అన్ని పాఠాలతో సమర్ధవంతంగా విశ్వాస అడుగులు ముందుకు వేసాడు.

 అపొ. కార్యములు 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులై యుందురని వారితో చెప్పెను. 

యాకోబు బంధీగా చేయబడి, ఉరితీయబడినప్పుడు కూడా, అతను తన విశ్వాసానికి అంతిమ పరీక్షను ఎదుర్కొన్నాడు. అగ్రిప్ప రాజైన హేరోదు, యూదా నాయకులు తమ అధికార బలంలో యాకోబు శిరచ్ఛేదం చేయబడ్డాడు; దాదాపు క్రీ.శ 44 లో జరిగిన ఈ సంఘటన స్పానిష్ సంప్రదాయం ప్రకారం, అతని మృతదేహాన్ని “శాంటియాగో డి కంపోస్టెలాకు” తీసుకెళ్లారు, నేడు ఈ స్థలం ప్రపంచం నలుమూలల నుండి అనేక క్రైస్తవ యాత్రికులను ఆకర్షిస్తుంది. అవును స్నేహితులారా,  తీవ్రమైన హింస తన చుట్టూ ఉన్నప్పటికీ, యాకోబు  తన విశ్వాసంలో స్థిరంగా నిలబడి, ధైర్యంగా తన బలిదానాన్ని అంగీకరించాడు, అతను పరలోకంలో తన శాశ్వతమైన ప్రతిఫలాన్ని పూర్తిగా విశ్వసించిన మొదటి క్రైస్తవ అమరవీరుడు.

ప్రియమైన స్నేహితులారా, యాకోబు యొక్క అచంచలమైన భక్తి -  వెలుగులో మనల్ని నిలబెట్టడానికి, దేవుని బలంపై ధైర్యంగా విశ్వసించగలిగితే, అట్టి విశ్వాసం నిబద్ధతతో మనల్ని పిలిచిన పిలుపులను చేరుకోవడానికి సవాలు చేసేదిగా ఉంటుంది. యాకోబు శ్రమలను ఎదుర్కొన్న రీతిగా, మన విశ్వాసానికి గొప్ప ఫలితాలు లభిస్తాయని తెలుసుకుని మనం కూడా అట్టి విశ్వాసంలో స్థిరంగా ఉండవచ్చు. మన ప్రభువైన యేసుక్రీస్తు పట్ల విధేయత మరియు హృదయపూర్వక భక్తి కలిగిన యాకోబు జీవితమే సిలువ సాక్షి. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆమెన్.

మన విశ్వాస ప్రయాణంలో, ప్రతి పరీక్షకు మనల్ని సన్నద్ధం చేసుకుంటూ, విజయానికి దారితీసే దేవుని శక్తిపై నమ్మకంతో ధైర్యంగా అడుగులు వేద్దాం.

Telugu Audio: https://youtu.be/Ny1ZYKqZyDg


40 Days - Day 2. James, Son of Zebedee: Embracing Faithfulness and Martyrdom for Christ

"But you will receive power when the Holy Spirit comes on you; and you will be my witnesses in Jerusalem, and in all Judea and Samaria, and to the ends of the earth." - Acts 1:8

James, the son of Zebedee, was counted among Jesus- most trusted followers. Handpicked to be part of His inner circle alongside Peter and John, James embarked on a journey with Christ marked by both moments of great enlightenment and trials. He bore witness to the miraculous acts and profound teachings of Jesus, as well as His transfiguration, all of which served to strengthen his faith. 

Despite being in such close proximity to Jesus, James was not immune to moments of doubt and vulnerability, just like the rest of the disciples. Nevertheless, with the guidance and grace of Christ, he grew in his understanding of the Kingdom and his role within it. He learned the value of humility, service, and selfless love – all essential lessons for a faithful follower of Jesus.

When James was arrested and executed, he faced the ultimate test of his faith. King Herod Agrippa, motivated by pleasing the Jewish leaders, had James put to death by the sword. James was beheaded by order of King Herod Agrippa I of Judaea, around 44 AD; according to Spanish tradition, his body was taken to Santiago de Compostela, where his shrine attracts Christian pilgrims from all over the world. Despite the intense persecution, James stood firm in his faith and bravely accepted his martyrdom, added to the list of first Christian martyrs who was fully confident of his eternal reward in heaven. 

In light of James- unwavering devotion, we are challenged to approach our own callings with boldness and commitment, trusting in God-s strength to sustain us. Just as James persevered through trials, may we also remain steadfast, knowing that our faithfulness will ultimately be richly rewarded. Let us look to James as a model of radical obedience and wholehearted devotion to our Lord Jesus Christ.

English Audio: https://youtu.be/5rFxvuK8NQY


Share this post