Skip to Content

సంశయవాదం నుండి గొప్ప విశ్వాసం, చివరికి హతసాక్షి – బర్తొలొమయి (నతనయేలు)

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: 40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
  • Reference: Sajeeva Vahini

40 Days - Day 10 సంశయవాదం నుండి గొప్ప విశ్వాసం, చివరికి హతసాక్షి – బర్తొలొమయి (నతనయేలు)

యోహాను 1:49 – నతనయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజవు అని ఆయనకు ఉత్తరమిచ్చెను.

నతనయేలు అని కూడా పిలువబడే బర్తొలొమయి పన్నెండు మంది అపొస్తలులలో ఒకరు, అతని జీవితం మరియు పరిచర్య, యేసుక్రీస్తుతో తన సంబంధం ఘననీయమైనది.

యోహాను సువార్తలో, అతని స్నేహితుడు ఫిలిప్పు ద్వారా యేసు వద్దకు తీసుకురాబడిన నతనయేలు అని గ్రహించగలం. తాము మెస్సీయను కనుగొన్నామని ఫిలిప్పు చేసిన ప్రకటనకు నతనయేలు యొక్క ప్రారంభ ప్రతిస్పందన సంశయవాదంతో గుర్తించబడింది. "నజరేతులోనుండి మంచిదేదైన రాగలదా?" అని ప్రశ్నిస్తాడు. (యోహాను 1:46). అయితే, యేసును కలుసుకున్న తర్వాత, నతనయేలు యొక్క సంశయవాదం లోతైన విశ్వాసానికి దారి తెసింది. యేసు - నతనయేలు తన దగ్గరకు రావడం చూసి, “ఇదిగో, ఇతనియందు ఏ కపటమును లేదని” ప్రకటించాడు. (యోహాను 1:47). క్రీస్తు మాటలకు ఆశ్చర్యపోయిన నతనయేలు అతన్ని దేవుని కుమారుడిగా మరియు ఇశ్రాయేలు రాజుగా గుర్తించాడు.

సువార్త ప్రకటిస్తున్న సమయంలో, అర్మేనియాలో ఉన్న అల్బనోపోలిస్‌ ప్రాంతంలో నతనయేలుకు భయంకరమైన శ్రమ ఎదురైంది. క్రీ.శ. 68లో అర్మేనియన్ రాజు ఆస్టిగేస్ ఆదేశం మేరకు తన చర్మం చీల్చబడి శిరచ్ఛేదం చేయడం ద్వారా అతను అమరుడయ్యాడు. నతనయేలు యొక్క విశ్వాస ప్రయాణం దేవునిపై అచంచలమైన విశ్వాసం, యేసుతో తన వ్యక్తిగత అనుభవం వంటి ప్రాముఖ్యతలపై వెలుగునిస్తుంది. నతనయేలు వలె, మనలో కూడా క్రీస్తు బోధనల గురించి అభ్యంతరాలు లేదా సందేహాలు ఉండవచ్చు. అయినప్పటికీ, మనము క్షుణ్ణంగా గ్రహించి విశ్వాసంతో ఆయన వద్దకు వచ్చినప్పుడు, మన అవగాహనను మించిన మార్గాలలో ఆయన తనను తాను మనకు ఆవిష్కరించుకుంటాడు.

యేసు పట్ల మన స్వంత ప్రతిస్పందనను ప్రతిబింబించమని నతనయేలు జీవితం మనలను ప్రోత్సహిస్తుంది. మనము తెరువబడిన హృదయంతో ఆయనను సమీపిస్తామా లేదా మన విశ్వాసానికి సంశయవాదం మరియు అనిశ్చితిలో అడ్డుపడతామా? నతనియేలు వలె, మనం కూడా వినయంగా ఇష్టపూర్వకంగా యేసుకు దగ్గరవుదాం, నూతనమైన, లోతైన మార్గాల్లో తనను తాను మనకు బహిర్గతం చేయడానికి ఆయనను ఆహ్వానిద్దాం. అట్టి రూపాంతర అనుభవంలో, మన శేష జీవితం ఆయన సత్యానికి మరియు ప్రేమకు నమ్మకమైన సాక్షులుగా జీవిద్దాం. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/y9bh6Q5xQbs

40 Days - Day 10 Bartholomew (Nathanael) : From Skepticism to Revelation - Encountered with Christ"

"Nathanael answered him, -Rabbi, you are the Son of God! You are the King of Israel!-" - John 1:49

Bartholomew, also known as Nathanael, is one of the twelve apostles whose life and ministry offer valuable insights into the nature of discipleship and the power of genuine encounter with Jesus Christ.

In the Gospel of John, we first encounter Nathanael as he is brought to Jesus by his friend Philip. Nathanael-s initial response to Philip-s declaration that they had found the Messiah is marked by skepticism. He questions, "Can anything good come out of Nazareth?" (John 1:46). However, upon meeting Jesus, Nathanael-s skepticism gives way to profound revelation. Jesus sees Nathanael approaching and declares, "Behold, an Israelite indeed, in whom there is no deceit!" (John 1:47). Astonished by Jesus- insight, Nathanael recognizes Him as the Son of God and King of Israel.

Bartholomew faced a gruesome fate in Albanopolis, situated in Armenia. He was martyred by flaying and beheading at the command of the Armenian king Astyages around 68 AD. Nathanael-s faith journey shines a light on the importance of embracing divine revelation and experiencing a personal encounter with Jesus. Just like Nathanael, we may have reservations or doubts about Jesus and His teachings. However, when we come to Him with a receptive heart and mind, He unveils Himself to us in ways that surpass our understanding. 

Nathanael-s story urges us to reflect on our own response to Jesus. Do we approach Him with an open mind and heart, or do we let skepticism and uncertainty hinder our faith? Like Nathanael, may we humbly and willingly draw near to Jesus, allowing Him to reveal Himself to us in new and profound ways.

May we, like Nathanael, be transformed by our encounter with Jesus and become faithful witnesses of His truth and love in the world. Amen

English Audio: https://youtu.be/Sx_xVexO_rE

SajeevaVahini.com

Share this post