Skip to Content

శ్రమలను ఎదుర్కొనే విశ్వాసం ఓర్పుకు నిబంధన – హతసాక్షి - సిసిలీకి చెందిన అగాథ

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: 40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
  • Reference: Sajeeva Vahini

40 Days - Day 20

శ్రమలను ఎదుర్కొనే విశ్వాసం ఓర్పుకు నిబంధన – హతసాక్షి - సిసిలీకి చెందిన అగాథ

బైబిల్ దినాలలో సురకూసై (అపో.కా. 28:12) నేడు సిసిలీ అని పిలువబడే ప్రాంతానికి చెందిన అగాథ, క్రైస్తవ చరిత్రలో గౌరవనీయమైన వ్యక్తి మరియు రొమ్ము క్యాన్సర్ నుండి ఎందరినో రక్షించిన ఘనత. ఆమె విశ్వాసం, ఓర్పు మరియు శ్రమల మధ్య క్రీస్తు పట్ల స్థిరమైన భక్తి యొక్క సద్గుణాలను కలిగి ఉంది. ఆమె జీవితం ప్రతికూల పరిస్థితుల్లో విశ్వాసం యొక్క పరివర్తన శక్తికి శక్తివంతమైన సాక్ష్యంగా పనిచేస్తుంది.

అగాథ క్రీ.శ. 3వ శతాబ్దంలో సిసిలీలో నివసించింది ఆ దినాలలో, రోమా సామ్రాజ్య అధికారంలో క్రైస్తవులపై తీవ్రమైన హింసకు గురైన సమయం. శ్రమలు ఉన్నప్పటికీ, అగాథ క్రీస్తుపై తన విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించుకుంది మరియు క్రీస్తును సేవించడానికి తన జీవితాన్ని అంకితం చేసింది.

అగాథ తన విశ్వాసాన్ని వదిలిల్పెట్టి, అన్యమత ఆచారాలలో పాల్గొనమని శ్రమ ఎదురైనప్పుడు, ఆమె భయంకరమైన హింసలకు ఒత్తిడికి గురైంది. తన క్రైస్తవ విశ్వాసమును విడిచిపెట్టమని బలవంతం చేసే ఆ ప్రయత్నంలో ఆమెను హింసించి, భయంకరమైన కౄరత్వానికి గురిచేసి ఆమె రొమ్ములను కూడా తొలగించారు. చివరికి మరణానికి అప్పగించబడింది.

ఫిలిప్పీయులకు 4:13 - నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.

నేనంటాను, అగాథ తన కష్టాన్నంతా భరించి, తన విశ్వాసంలో స్థిరంగా ఉండి, క్రీస్తుతో కలిగియున్న తన సంబంధానికి ఓదార్పు మరియు బలాన్ని పొందింది. భయం లేదా నిస్పృహకు లోనయ్యే బదులు, ఆమె దేవుని ప్రేమ మరియు విశ్వసనీయతపై తనకున్న నమ్మకాన్ని అంటిపెట్టుకొని, ప్రతి పరీక్షలోనూ తనను ఆదుకుంటాడనే నమ్మకంతో ఆఖరి శ్వాస వరకు విశ్వాసంలో స్థిరంగా నిలబడింది. భరించలేని విపరీతమైన నొప్పి, బాధ ఉన్నప్పటికీ, అగాథకు క్రీస్తు పట్ల అచంచలమైన విశ్వాసం ఎన్నడూ తగ్గలేదు. ఆమె మరణం వరకు కూడా దేవునికి తన నమ్మకత్వాన్ని ప్రదర్శించింది. 

అగాథ జీవితం బాధలు మరియు కష్టాలకు మన వ్యక్తిగత విశ్వాసం పరిశీలించేలా సవాలు చేస్తుంది. ఊహాతీతమైన బాధ లేదా కష్టాలను ఎదుర్కొన్నప్పుడు కూడా మనం దేవుని బలం మరియు విశ్వసనీయతపై నమ్మకం ఉంచడానికి సిద్ధంగా ఉండగలమా? మన జీవితంలో, విశ్వాసంలో స్థిరపరచి, మనం భరించగలిగే శక్తిని పొందుకునే ఆలోచనలు కలిగి యుండగలమా?

అగాథా వలె, కష్ట సమయాల్లో ఆయన మనకు ఆశ్రయం మరియు బలం అని తెలుసుకుని, క్రీస్తుతో మనకున్న సంబంధంలో ధైర్యం మరియు స్థిరత్వాన్ని కలిగియుందాము. శ్రమలను ఎదుర్కొన్నప్పుడు కూడా మన విశ్వాసంలో స్థిరంగా ఉండేందుకు మరియు ప్రతి పరీక్షలో మనల్ని నడిపించే క్రీస్తు శక్తిపై నమ్మకం ఉంచేందుకు ప్రయత్నం చేద్దాం. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/vVAOueVIRTE

40 Days - Day 20

Agatha of Sicily: A Testament of Faith and Endurance in the Face of Suffering

Agatha of Sicily, a revered figure in Christian history and the patron saint of breast cancer patients, embodies the virtues of faith, endurance, and unwavering devotion to Christ amidst suffering. Her life serves as a powerful testimony to the transformative power of faith in the face of adversity.

Agatha was a young Christian woman living in Sicily (Syracuse in biblical days – Acts 28:12) during the 3rd century AD, a time of intense persecution against Christians under the Roman Empire. Despite the risks involved, Agatha openly professed her faith in Christ and dedicated her life to serving Him.

When Agatha refused to renounce her faith and participate in pagan rituals, she was subjected to horrific torture and abuse. Her tormentors subjected her to unspeakable cruelty, including the mutilation of her breasts, in an attempt to force her to abandon her Christian beliefs.

Throughout her ordeal, Agatha remained steadfast in her faith, finding solace and strength in her relationship with Christ. Rather than succumbing to fear or despair, she clung to her belief in God-s love and faithfulness, trusting that He would sustain her through every trial.

"I can do all this through him who gives me strength." - Philippians 4:13

Despite the excruciating pain and suffering she endured, Agatha-s unwavering devotion to Christ never wavered. She remained resolute in her commitment to Him, even unto death.

Agatha-s life challenges us to examine our own response to suffering and adversity. Are we willing to trust in God-s strength and faithfulness, even when faced with unimaginable pain or hardship? Do we allow our faith to sustain us and empower us to endure, even in the darkest of times?

Like Agatha, may we find courage and resilience in our relationship with Christ, knowing that He is our refuge and strength in times of trouble. May her example inspire us to remain steadfast in our faith, even when confronted with adversity, and to trust in the power of Christ to carry us through every trial. Amen.

English Audio: https://youtu.be/vmPvGfyjK0U

SajeevaVahini.com 

Share this post