Skip to Content

శిష్యునిగా అర్హతను సంపాదించుకొని హతసాక్షియైన - మత్తీయ

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: 40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
  • Reference: Sajeeva Vahini

40 Days - Day 13శిష్యునిగా అర్హతను సంపాదించుకొని హతసాక్షియైన - మత్తీయ

ఎఫెసీయులకు 2:10. మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై, మనము క్రీస్తు యేసు నందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.

మత్తీయ కొత్త నిబంధనలో స్థిరత్వం, దేవుని ప్రణాళికపై ఆధారపడటం మరియు దేవుని పిలుపుకు లోబడే స్వభావాన్ని వ్యక్తపరుస్తాడు. అపొస్తలుల కార్యములు ప్రాకారం, యూదా ఇస్కరియోతు అనంతరం, యేసు శిష్యులలో ఖాళీగా ఉన్న స్థానాన్ని భర్తీ చేయడానికి మత్తీయ ఎంపిక చేయబడ్డాడు. బాప్తీస్మమిచ్చు యోహాను చేత బాప్తీస్మము పొందుకున్నప్పటి నుండి యేసుతో పాటు నడచి అతని పునరుత్థానాన్ని కూడా చూసి శిష్యునిగా అర్హతను సంపాదించుకున్నాడు.

మత్తీయ శిష్యునిగా గుర్తింపు కోసం పాటుపడలేదు గాని, యేసును తెలుసుకున్న క్షణం నుండి వెంబడిస్తూ, ఆయన బోధనలకు కట్టుబడి ఉండటంపై దృష్టిసారించాడు. ఇతర శిష్యులకు సహాయం చేయడంలో అతను తన విధులను నిర్వర్తించాడు. సరైన సమయం వచ్చినప్పుడు, మత్తీయ - తన కోసం దేవుడు నియమించిన స్థానాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండగలిగాడు. పెంతెకోస్తు దినమున ఇతర అపొస్తలులతో పరిశుద్ధాత్మ వరమును పొందిన తర్వాత, అతను యూదయ పరిసర ప్రాంతాలలో సువార్త ప్రకటించడానికి బయలుదేరాడు. క్రీ.శ. 64లో మత్తీయను యేరూషలేము ప్రజలు రాళ్లతో కొట్టి చంపి, అతని మరణం తరువాత, యూదులు తమ నేరాన్ని దాచడానికి అతనిని శిరచ్ఛేదం చేశారని చరిత్రలో గమనించగలం.

నేనంటాను, మత్తీయ జీవితం - మన చర్యలు ఇతరులకు ఎంత అమూల్యమైనవిగా లేదా గుర్తించబడనివిగా కనిపించినా, దేవుని నిర్దేశాలకు శ్రద్ధ వహించడానికి, వాటిని అనుసరించడానికి మనకు సవాలుగా చేయబడుతుంది. దేవుడు మన ప్రయత్నాలను గుర్తించి, వాటిని తన జ్ఞానయుక్తమైన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తాడని తెలుసుకుని, ఆయన మనకు అప్పగించిన ఏ సామర్థ్యంలోనైనా శ్రద్ధగా సేవ చేయమని మత్తీయ వలె సిద్దమనసు కలిగియుండాలి.

మత్తీయ అపొస్తలునిగా ఎంపిక చేయబడడంలో దేవుని సమయం ఖచ్చితమైనదని గ్రహించగలం. అతడు ఎంపిక చేయబడక ముందు అంతగా ప్రసిద్ధి చెందనప్పటికీ, దేవుడు అతనిని తగిన సమయంలో నియమించబడుటకు తీర్చిదిద్దాడు. అదేవిధంగా, దేవుడు మనల్ని కూడా ముఖ్యమైన పాత్రలుగా, పరిచర్య సాధనాలుగా సంసిద్ధం చేస్తున్నాడు, ఆయన మనల్ని ఎన్నుకోవాలంటే మన విశ్వాసంలో ఓపికను, విశ్వసనీయతలో విధేయతను కనుబరచే వారంగా ఉండాలి.

మత్తీయ ప్రయాణం మన జీవితాల కోసం దేవుని ప్రత్యేకమైన పిలుపు మరియు ఉద్దేశ్యాన్ని స్వీకరించడానికి మనకు స్ఫూర్తినిస్తుంది. దేవుని కొరకు మనం చేసే పరిచర్య అందరికీ కనబడకపోయినా, మన విధేయత మనలోని సహనం, తగిన సమయంలో ఆయన చిత్తమైన ప్రణాళికలతో నడిపించేదిగా ఉంటుంది. అట్టి పరిచర్యలో మనమందరం అర్ధతను పొందే కృప ప్రభువు దయజేయును గాక. ఆమెన్.

Telugu Audio:https://youtu.be/IVpnoMIdS28

40 Days - Day 13.Matthias: A Testament to Faithfulness and Divine Timing

"For we are God-s handiwork, created in Christ Jesus to do good works, which God prepared in advance for us to do." - Ephesians 2:10

Matthias appears in the New Testament as a symbol of steadfastness, reliance on God-s plan, and willingness to embrace God-s call. Introduced in the Acts of the Apostles, Matthias was chosen after Judas Iscariot-s departure to fill the vacant position among Jesus-s disciples. To qualify, candidates had to have accompanied Jesus from the time of John the Baptist-s baptism and witnessed His resurrection. Matthias was among the potential replacements.

Matthias did not actively pursue the role of an Apostle but instead focused on following Jesus and adhering to his teachings. He carried out his duties in assisting the other followers. When the right moment presented itself, Matthias was prepared to assume the position God had designated for him. After receiving the Holy Spirit with the other apostles on the day of Pentecost, he left to preach the gospel in Judea and Colchis. During 64 AD Matthias was stoned by the people of Jerusalem. After his death, he was beheaded by the Jews to conceal their crime. 

Matthias- life serves as a reminder to us to pay attention to God-s directions and to follow them, regardless of how insignificant or unrecognized our actions may appear to others. We are invited, like Matthias, to serve God diligently in whatever capacity he has entrusted us with, in the knowledge that he will recognize our efforts and employ them for his wise purposes.

Matthias-s selection as an apostle shows that God-s timing is precise. Despite not being well-known before his appointment, God had been grooming him all along. Likewise, God may be preparing us for significant roles or missions, requiring our trust and faithfulness as we patiently wait. 

Matthias-s journey inspires us to embrace God-s unique calling and purpose for our lives. Whether our tasks are highly visible or hidden, let us serve God loyally, yakin that our obedience will advance His plans and honor His name. Amen.

English Audio: https://youtu.be/Nks_Q7Acl70

SajeevaVahini.com 

Share this post