Skip to Content

సెయింట్ జస్టిన్ - హింసను ఎదుర్కొన్న విశ్వాసానికి ప్రతీక - హతసాక్షి

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: 40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
  • Reference: Sajeeva Vahini

40 Days - Day 17

సెయింట్ జస్టిన్ - హింసను ఎదుర్కొన్న విశ్వాసానికి ప్రతీక - హతసాక్షి 

జస్టిన్ మర్టైర్ అని కూడా పిలువబడే సెయింట్ జస్టిన్, గొప్ప మేధాశక్తి తో పాటు ఆధ్యాత్మికతలో కూడా అనుభవం కలిగిన వ్యక్తి. జస్టిన్, హింసను ఎదుర్కొన్నప్పుడు క్రీస్తు పట్ల అచంచలమైన విశ్వాసానికి ఒక శక్తివంతమైన ఉదాహరణ. అతని జీవితం మరియు రచనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. అతని విశ్వాసం , దేవుని గూర్చిన శాశ్వతమైన శక్తిని మరియు సత్యం కోసం ధైర్యంగా నిలబడటం యొక్క ప్రాముఖ్యతను మనకు గుర్తుచేస్తుంది.

క్రీస్తుశకం రెండవ శతాబ్దంలో జన్మించిన జస్టిన్ సత్యాన్వేషణలో ఆధ్యాత్మిక అన్వేషణను ప్రారంభించిన తత్వవేత్త. క్రైస్తవునిగా తన జీవితం ప్రారంభించిన దినాలలో, యేసుక్రీస్తు యొక్క బోధనలు మరియు ప్రారంభ క్రైస్తవ హతసాక్షుల జీవితాల ద్వారా ప్రభావితమయ్యాడు, క్రీస్తు కొరకు ఒక నాయకునిగా నిలబడ్డాడు.

అన్యమత తత్వవేత్తలు మరియు రోమా అధికారులతో జస్టిన్ నిర్భయంగా చర్చలలో నిమగ్నమయ్యేవాడు. సువార్త యొక్క సత్యం మరియు క్రైస్తవ విశ్వాసం యొక్క హేతుబద్ధత కోసం వాదించేవాడు. ప్రారంభ క్రైస్తవ విశ్వాస అభ్యాసాలపై విలువైన అంతర్దృష్టులను అందిస్తూ, అదే సమయంలో క్రైస్తవ మతం చుట్టూ ఉన్న ఆరోపణలు, దురభిప్రాయాలకు వ్యతిరేకంగా పోరాడి క్రైస్తవులకు రక్షణను కలిగించమని రోమా చక్రవర్తులను ప్రదేయపడేవాడు. 

ఆ దినానలో క్రీ.శ. 167లో రోమాకు చెందిన రుస్టికస్, జస్టిన్‌ను విచారించి, అతను తన విశ్వాసాన్ని తిరస్కరించి, తమ అన్యమత దేవుళ్లను మరియు చక్రవర్తి శాసనాలను అనుసరించినట్లయితే, అతని ప్రాణాలకు ఎటువంటి ముప్పు ఉండదని బెదిరించాడు. కానీ తన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నాడు – అదే సమయలో ఆరుగురు సహచరులతో పాటు కొరడాలతో కొట్టబడి చంపబడ్డాడు సెయింట్ జస్టిన్.

"సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది." – రోమా 1:16

ప్రమాదాలు ఉన్నప్పటికీ, జస్టిన్ - క్రీస్తు విషయంలో, మరియు తన సంఘం పట్ల నిబద్ధతకలిగి స్థిరంగా నిలబడ్డాడు. హింసలు చివరికి మరణం ఎదురైనప్పటికీ అంతంవరకు ధైర్యంగా సువార్తను ప్రకటించాడు. జస్టిన్ జీవితం, సువార్త విషయంలో మన విశ్వాసాన్ని సవాలు చేసేదిగా ఉంది. దైనందిన జీవితంలో నిమగ్నమైనప్పటికీ విశ్వాసము పరీక్షించబడిన ప్రతీసారి రాజీపడక దానికి ఎదుర్కొనే నిశ్చయత మనకుందా? మన స్వంత సౌలభ్యం మరియు భద్రత కంటే సువార్త సత్యానికి ప్రాధాన్యత ఇవ్వగలమా?

జస్టిన్ వలే, మనం కూడా సువార్త నిమిత్తం సిగ్గుపడకుండా, క్రీస్తు పట్ల మనకున్న విశ్వాస విషయంలో రాజీపడకుండా జీవిద్దాం. నమ్మకంగా జీవిస్తూ, తరచుగా సత్యాన్ని తిరస్కరించే ప్రపంచంలో సత్యం కోసం స్థిరంగా నిలబడటానికి సాక్షిగా జీవిద్దాం. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/s8XbVTr679k

40 Days - Day 17. Justin Martyr: Champion of Faith in the Face of Persecution

Justin Martyr, also known as Saint Justin, stands as a powerful example of intellectual rigor, spiritual depth, and unwavering commitment to Christ in the face of persecution. His life and writings continue to inspire Christians around the world, reminding us of the enduring power of faith and the importance of standing boldly for truth.

Born in the second century AD, Justin was a philosopher who embarked on a spiritual quest in search of truth. After encountering Christianity, Justin was profoundly impacted by the teachings of Jesus Christ and the witness of the early Christian martyrs. He eventually converted to Christianity and became one of its most influential defenders and apologists.

Justin fearlessly engaged in debates with pagan philosophers and Roman authorities, tirelessly advocating for the truth of the Gospel and the rationality of the Christian faith. His two Apologies, addressed to the Roman emperors, provide valuable insights into early Christian beliefs and practices, while also offering a defense against the accusations and misconceptions surrounding Christianity. 

During 167 AD Rusticus of Rome interrogated Justin and told him that if only he denied his faith and followed the pagan gods and the edicts of the emperor, his life could be spared. But Justin held fast in his faith – and for that he was scourged and put to death alongside six companions in the faith.

Despite the risks involved, Justin remained steadfast in his commitment to Christ and His Church. He boldly proclaimed the Gospel, even in the face of persecution and martyrdom. Justin-s unwavering faith and courage ultimately led to his arrest and execution for refusing to renounce his Christian beliefs.

"For I am not ashamed of the gospel, because it is the power of God that brings salvation to everyone who believes: first to the Jew, then to the Gentile." - Romans 1:16

Justin-s life challenges us to consider our own commitment to Christ and the Gospel. Are we willing to engage with our culture and defend our faith with boldness and clarity? Do we prioritize the truth of the Gospel above our own comfort and safety?

Like Justin Martyr, may we be unashamed of the Gospel and unyielding in our commitment to Christ, regardless of the challenges we may face. May we draw inspiration from his example of intellectual honesty, spiritual depth, and unwavering devotion to Christ, and may we be willing to stand firm for truth in a world that often rejects it. Amen.

English Audio: https://youtu.be/f2mlopxA7-c

SajeevaVahini.com 

Share this post