Skip to Content

పరవచనాత్మక దర్శనాల సాక్షి - యోహాను | John: An Exemplar of Loyalty and Divine Revelation

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: 40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
  • Reference: Sajeeva Vahini

40 Days - Day 14

పరవచనాత్మక దర్శనాల సాక్షి - యోహాను

ప్రకటన గ్రంథం 21:3 అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.

ప్రకటన గ్రంధ కర్త, యేసు క్రీస్తు శిష్యుడు, సన్నిహితుడు యోహాను. క్రీస్తుతో ఆదర్శప్రాయమైన విధేయత, అంకితభావం మరియు ప్రగాఢ బంధాన్ని కలిగి ఉన్నాడు. యేసు రొమ్మున ఆనుకొన్న శిష్యుడుగా ఇతని ప్రయాణం, దేవునితో సన్నిహిత్యం కలిగి, మనకు స్ఫూర్తినిస్తూ మార్గనిర్దేశం చేస్తుంది.

యోహానును ఆయనతో పాటు తన సహోదరుడైన యాకోబును, యేసు పిలిచినప్పటి నుండి, భక్తితో అనుసరించడం మొదలుపెట్టాడు. సువార్తలలో, అద్భుతాలు మరియు రూపాంతరాలకు సాక్ష్యమిచ్చే ముఖ్య శిష్యునిగా యోహానును మనం కనుగొంటాము. ప్రభురాత్రి భోజనం సమయంలో, యోహాను తన సన్నిహిత సంబంధాన్ని ప్రతిబింబిస్తూ యేసు వైపు మొగ్గు చూపాడు.

యేసు పరలోకానికి ఆరోహణమైన తర్వాత, యోహాను నిర్భయంగా సువార్త సందేశాన్ని వ్యాప్తి చేయడం కొనసాగించాడు. తన విశ్వాసం కోసం హింసించబడినా, జైలు పాలైనప్పటికీ కూడా ,దేవుని వాగ్దానాలపై మరియు నిత్యజీవ నిరీక్షణపై నమ్మకం కలిగియుండి తన విశ్వాసంలో బలంగా నిలబడ్డాడు. దాదాపు క్రీ.శ 95 లో రోమా పాలనలో, సువార్త వలన కలిగిన శ్రమను బట్టి, యోహాను మరుగుతున్న నూనెలో వేయబడి శిక్షించబడ్డాడు. అయిన ఆ శ్రమ నుండి అద్భుతంగా తప్పించబడిన అతనిని మారుమూల ద్వీపమైన పత్మాసుకు తరలించబడ్డాడు.

పత్మాసులో పరవశుడైనప్పుడు, యోహాను యేసుక్రీస్తు నుండి దర్శనం పొందాడు. అతను ఈ దర్శనాన్ని “ప్రకటన గ్రంధం” గా నమోదు చేశాడు. ఇవన్ని ప్రవచనాలు మరియు రాబోయే దినములలో జరుగబోయే సంగతుల సమాహారం. యోహాను వ్రాసిన పత్రికలు, చీకటిపై క్రీస్తు సాధించిన విజయాన్ని, దేవుని పాలనను మరియు పునరుద్ధరించబడిన ఉనికి యొక్క వాగ్దానాన్ని తెలియజేస్తాయి. అతని జీవితం క్రీస్తుతో మన సంబంధాన్ని బలపరచుకోవడానికి, దేవుని వాగ్దానాల ద్వారా రూపొందించబడే స్ఫూర్తినిస్తుంది.

శ్రమలు ఎదురైనా యోహాను వలే యేసును హృదయపూర్వకంగా అనుసరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనం క్రీస్తుతో సన్నిహిత సంబంధాన్ని కోరుకుంటామా, ఆయన మన మార్గాన్ని నడిపించడానికి అనుమతించగలమా?

యోహాను వలె, క్రీస్తుతో లోతైన సంబంధాన్ని పెంపొందించుకుందాం, క్రీస్తు ప్రేమ మనల్ని హృదయాంతరంగంలో నుండి మలుస్తుంది. క్రీస్తు వెల్లడించిన సత్యాన్ని స్వీకరించడం ద్వారా, ఆయన వాగ్దానాలపై విశ్వాసముంచడమే కాకుండా, మన చుట్టూ ఉన్నవారిని క్రీస్తువైపు నడిపిస్తూ, పాపంపై విజయం, మరియు మరణంపై విజయాన్ని వారికి ధైర్యంగా ప్రకటించవచ్చు. అట్టి సువార్త సిద్దమనసు ప్రభవు మనందరికీ దయజేయును గాక. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/OsGw6hPO6ps

40 Days - Day 14

John: An Exemplar of Loyalty and Divine Revelation

"And I heard a loud voice from the throne saying, -Behold, the dwelling place of God is with man. He will dwell with them, and they will be his people, and God himself will be with them as their God.-" - Revelation 21:3

John, the close disciple of Jesus who wrote Revelation, embodies exemplary loyalty, dedication, and a profound bond with Christ. His journey inspires and guides believers striving for an intimate walk with God. 

Since his calling with his brother James, John devotedly followed Jesus. In the Gospels, we find John as a key disciple witnessing miracles and the transfiguration. During the Last Supper, he leaned against Jesus, reflecting their close connection.

After Jesus ascended to heaven, John continued spreading the Christian message without fear. Despite being persecuted and jailed for his beliefs, John remained strong in his faith, trusting in Jesus- promises and the hope of eternal life. During Roman rule in 95 AD, John was punished for preaching by being thrown into boiling oil, but emerged unharmed. He was then sent to the remote island of Patmos. 

During his exile on Patmos, John received a vision from Jesus Christ. He recorded this vision in the Book of Revelation, a collection of prophecies and symbolic messages. John-s writings convey the triumph of Christ over darkness, the reign of God, and the promise of a renewed existence. His life inspires us to strengthen our bond with Christ and embody His principles. Are we prepared to wholeheartedly follow Jesus, like John, despite adversity? Do we seek a close relationship with Christ, allowing Him to guide our path? 

Let us, like John the disciple, nurture a profound connection with Christ, where His love moulds us from the inside out. By embracing the truth He reveals, we can put our faith in His promises and boldly declare His triumph over sin and death to those around us. Amen.

English Audio: https://youtu.be/DU-_vNWTFVg

SajeevaVahini.com 

Share this post