Skip to Content

ప్రతికూల పరిస్థితులలో నమ్మకమైన సాక్షి – యూదా (తద్దయి)

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: 40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
  • Reference: Sajeeva Vahini

40 Days - Day 11 ప్రతికూల పరిస్థితులలో నమ్మకమైన సాక్షి – యూదా (తద్దయి)

యూదా 1: 20,21. ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్దమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని యుండుడి.

తద్దయియను మారుపేరుగల లెబ్బయి, అల్ఫయి కుమారుడును, యాకోబు సహోదరుడు యూదా. అతని జీవితం సవాళ్లు మరియు ప్రతికూల పరిస్థితులలో విశ్వాసం మరియు పట్టుదల యొక్క శక్తిని ఉదాహరణగా చూపుతుంది.

ఇతర అపొస్తలులవలె యూదా, సువార్తలలో ప్రముఖంగా కనిపించనప్పటికీ, క్రీస్తు పరిచర్య విషయంలో నిబద్ధత కలిగి,  అపొస్తలులలో ఒకనిగా, ఆది సంఘంలో తన పాత్ర ద్వారా స్పష్టమవుతుంది.

యేసు యొక్క భూసంబంధమైన పరిచర్య సమయంలో ఆయన బోధలు, అద్భుతాలు మరియు త్యాగపూరిత ప్రేమను యూదా ప్రత్యక్షంగా చూశాడు. అతను యేసుతో పాటు నడిచి, అతని నుండి నేర్చుకొని గొప్ప శక్తిని అనుభవించాడు.

యేసు పునరుత్థానం మరియు ఆరోహణ తర్వాత, సువార్త సందేశాన్ని వ్యాప్తి చేయడంలో యూదా కీలక పాత్ర పోషించాడు. సాంప్రదాయం ప్రకారం, అతను సువార్తను ప్రకటిస్తూ, వివిధ ప్రాంతాలలో క్రైస్తవ సంఘాలను స్థాపించడానికి విస్తృతంగా ప్రయాణించాడు. దాదాపు క్రీ.శ. 65లో సీమోతో కలిసి పారసీక దేశంలో సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు గొడ్డలితో నరికి చంపబడ్డాడు, యూదా హతసాక్షి అయ్యాడు. 

ప్రియమైన స్నేహితులారా, కష్టాలు లేదా వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ, క్రీస్తుపై మన విశ్వాసం స్థిరంగా ఉండమని యూదా జీవితం సవాలు చేస్తుంది. యూదా వలె, మన విశ్వాస ప్రయాణంలో మనకు అడ్డంకులు మరియు పరీక్షలు ఎదురుకావచ్చు, కానీ దేవుడు మనతో ఉన్నాడని, పట్టుదలతో వాటిని అధిగమించడానికి మనకు శక్తినిచ్చాడని తెలుసుకోవడంలో గొప్ప ఆదరణ పొందవచ్చు.

దేవుని రాజ్యానికి మనవంతు కృషి, చిన్నవైనా పెద్దవైనా, అవి దేవుని దృష్టిలో ముఖ్యమైనవని యూదా జీవితం మనకు గుర్తుచేస్తుంది. నేనంటాను, వేల మందికి బోధించినా లేదా ఒక్కరికి సువార్త ప్రకటించినా, విశ్వసనీయత మరియు విధేయత యొక్క ప్రతీ కార్యము, మన జీవితాలను ప్రభావితం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. క్రీస్తు పరిచర్యను ముందుకు తీసుకువెళుతుంది. దేవుని ఆత్మ మీకు తోడైయుండును గాక. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/lwruiqbZYyA

40 Days - Day 11. Jude (Thaddaeus): Faithful Witness in the Face of Adversity

"But you, dear friends, by building yourselves up in your most holy faith and praying in the Holy Spirit, keep yourselves in God’s love as you wait for the mercy of our Lord Jesus Christ to bring you to eternal life." - Jude 1:20-21

Jude, also known as Thaddaeus, is a figure in the New Testament whose life exemplifies the power of faithfulness and perseverance in the face of challenges and adversity.

While Jude is not as prominently featured in the Gospels as some of the other apostles, his commitment to Jesus and His mission is evident through his inclusion among the twelve apostles and his subsequent role in the early Christian church.

Jude likely witnessed firsthand of  teachings, miracles, and sacrificial love of Jesus during His earthly ministry. He walked alongside Jesus, learning from Him and experiencing the transforming power of His presence.

After Jesus- resurrection and ascension, Jude played a vital role in spreading the Gospel message. Tradition holds that he traveled extensively, proclaiming the good news of salvation and establishing Christian communities in various regions. During 65 AD, while Jude and Simon were preaching together in Persia they both were martyred together. Simon was martyred by Saw, he was cut into half and Jude by an axe.

Jude-s life - challenges us to remain faithful and steadfast in our commitment to Christ, even when faced with difficulties or opposition. Like Jude, we may encounter obstacles and trials along our journey of faith, but we can take heart in the knowledge that God is with us, empowering us to persevere and overcome.

Jude- reminds us that our contributions to the Kingdom of God, no matter how seemingly small or insignificant, are significant in God-s eyes. Whether preaching to large crowds or ministering to individuals in need, every act of faithfulness and obedience has the potential to impact lives and advance the cause of Christ.

May we, like Jude, be bold and courageous in our proclamation of the Gospel, knowing that God-s strength is made perfect in our weakness. Let us remain steadfast in our devotion to Christ, trusting in His faithfulness to sustain us and His power to accomplish His purposes through us. Amen

English Audio: https://youtu.be/rmLG8XMy_cQ

SajeevaVahini.com 

Share this post