Skip to Content

పేతురు - విశ్వాసం యొక్క సాక్షి, క్రీస్తు హతసాక్షి | Peter: Witness of Faith, Martyr for Christ

7 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: 40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
  • Reference: Sajeeva Vahini

40 Days - Day 4

పేతురు - విశ్వాసం యొక్క సాక్షి, క్రీస్తు హతసాక్షి

పేతురు 2:9 అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.

సీమోను పేతురు అని కూడా పిలువబడే పేతురు కొత్త నిబంధనలో గుర్తించదగిన వ్యక్తి. దుడుకు స్వభావం కలిగినప్పటికీ యేసుతో తన ప్రయాణంలో, అతను అపారమైన విశ్వాసం మరియు ధైర్యన్ని ప్రదర్శించాడు, అలాగే సందేహం మరియు వైఫల్యం వంటి లక్షణాలను కూడా కొన్ని సందర్భాల్లో గమనించగలం. అయితే, వీటన్నింటి ద్వారా, పేతురు తన జీవితంలో దేవుని కృపను గూర్చిన బలమైన సాక్ష్యాన్ని కలిగియున్నాడు.

మనుష్యులను పట్టే జాలరిగా మారడానికి, యేసు క్రీస్తు చేత పిలిచిన క్షణం నుండి, పేతురు జీవితం గొప్ప అనుభవాలకు దారితీసింది. అతను ఆశ్చర్యపరిచే అద్భుతాలు, లోతైన బోధనలు మరియు యేసు యొక్క షరతులు లేని ప్రేమను ప్రత్యక్షంగా చూడగలిగాడు. క్రీస్తును సంపూర్ణంగా విశ్వసించగలిగాడు, నీటి మీద నడిచిన అనుభవాన్ని పొందాడు. క్రీస్తుపై లోతైన అవగాహన మరియు విశ్వాసం తన భక్తి జీవితానికి గొప్ప ఉదాహరణ.

పేతురుకు యేసు పట్ల బలమైన ప్రేమ ఉన్నప్పటికీ, బలహీనత మరియు సందేహం వంటి లక్షణాల నుండి తప్పించుకోలేకపోయాడు. యేసు క్రీస్తు ప్రవచించినట్లుగా ఆయన విచారణ సమయంలో మూడుసార్లు యేసును తిరస్కరించినప్పుడు తన వైఫల్యాలు స్పష్టంగా కనిపించాయి. కానీ అట్టి వైఫల్యల్లో కూడా, క్రీస్తు యొక్క అపారమైన క్షమాపణ మరియు పునరుద్ధరణను అనుభవించగలిగాడు పేతురు.యేసు పునరుత్థానం మరియు ఆరోహణ తరువాత, పేతురు ప్రారంభ క్రైస్తవ సంఘంలో నిర్భయమైన ప్రభావవంతమైన నాయకుడిగా ఉద్భవించాడు. శక్తితో నిండిన బోధనలతో పాటు ఎన్నో అద్భుతాలు కూడా చేశాడు. యూదులుకు, అన్యుల వర్గాలకు సువార్తను వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. హింస వ్యతిరేకత ఎదురైనప్పుడు పేతురు యొక్క అచంచలమైన సంకల్పం, తరతరాలుగా విశ్వాసులకు స్ఫూర్తినిస్తూనే ఉంది. బహుశా క్రీ.శ. 64-68 లో అతనిని ఉరితీయమని రోమా చక్రవర్తి నీరో ఆదేశించినప్పుడు. పేతురు తలక్రిందులుగా సిలువ వేయమని అభ్యర్థించాడు, అతను క్రీస్తు వలె చనిపోవడానికి అనర్హుడని భావించుకున్నాడు.

నేనంటాను, దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి అసంపూర్ణమైన పాత్రలను ఉపయోగించగలడని పేతురు జీవితం మనకు గుర్తుచేస్తుంది. మనలో లోపాలు మరియు తప్పులు ఉన్నప్పటికీ, దేవుని అపరిమితమైన కృప, తన పని కోసం మనలను ఎన్నుకోడానికి, మరియు సన్నద్ధం చేయడానికి సహాయపడుతుంది. పేతురు వలే, మనము కూడా మన దేవుని యొక్క ప్రతిష్టాత్మకమైన బిడ్డలముగా మన గుర్తింపును పూర్తిగా స్వీకరిద్దాం. హృదయపూర్వకంగా యేసును వెంబడిస్తున్నప్పుడు ధైర్యంగా వినయంతో, విశ్వాసంతో అడుగులు ముందులు వేద్దాం. దేవుని కృప మీతో మనందరితో ఉండును గాక.

Telugu Audio: https://youtu.be/CWRKw604Ark?feature=shared

40 Days - Day 4.Peter: Witness of Faith, Martyr for Christ

"But you are a chosen people, a royal priesthood, a holy nation, God-s special possession, that you may declare the praises of him who called you out of darkness into his wonderful light." - 1 Peter 2:9

Peter, also known as Simon Peter, is a notable and dynamic figure in the New Testament. Throughout his journey with Jesus, he experiences moments of immense faith and courage, as well as moments of doubt and failure. However, through it all, Peter-s life serves as a powerful example of the life-changing impact of God-s grace. 

From the moment he is called by Jesus to become a fisher of men, Peter-s life is forever transformed. He witnesses firsthand the astonishing miracles, profound teachings, and unconditional love of Jesus. One of the most significant moments in Peter-s journey of discipleship is when he confesses Jesus as the Christ, the Son of the living God. This pivotal moment demonstrates his deepening understanding and devotion to his faith.

Although Peter had a strong love for Jesus, he wasn-t immune to moments of weakness and uncertainty. These struggles were evident when he denied Jesus three times during His trial, as Jesus had predicted. But even in his moment of failure, Peter experienced the immense forgiveness and restoration of Christ. 

Following Jesus- resurrection and ascension, Peter emerged as a fearless and influential leader in the early Christian church. He fearlessly preached, performed miracles, and played a pivotal role in spreading the Gospel to both Jewish and Gentile communities. Peter-s unwavering determination in the face of persecution and opposition continues to inspire believers across generations. His execution was ordered by the Roman Emperor Nero, who blamed the city-s Christians for a terrible fire that had ravaged Rome, around 64-68 AD. Peter requested to be crucified upside down, as he felt unworthy to die in the same manner as Christ.

Peter-s life reminds us that God can use imperfect vessels to accomplish His purposes. Despite our flaws and mistakes, God-s boundless grace is more than enough to redeem and equip us for His work. Just as Peter did, let us fully embrace our identity as cherished children of God, boldly and humbly walking in faith as we wholeheartedly pursue Jesus.

English Audio: https://youtu.be/4iOjwVbeTSM

SajeevaVahini.com 

Share this post