Skip to Content

పాస్టర్ గురుమూర్తి మాడి, సువార్త కోసం హతసాక్షి

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: 40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
  • Reference: Sajeeva Vahini

40 Days  - 40వ రోజు. పాస్టర్ గురుమూర్తి మాడి, సువార్త కోసం హతసాక్షి

పాస్టర్ గురుమూర్తి మాడి తన సాహసోపేత త్యాగం యొక్క జ్ఞాపకం, విశ్వాసుల హృదయాలలో ప్రతిధ్వనించేలా ఉంది. హింస మరియు ప్రమాదంలో కూడా సువార్తను పంచుకోవడంలో వారి విశ్వాసం మరియు నిబద్ధతలో స్థిరంగా నిలబడటానికి అనేకులను ప్రేరేపిస్తుంది. ఇతరులకు సేవ చేయడంలో మరియు క్రీస్తు ప్రేమను నిర్భయంగా ప్రకటించడంలో అతని అచంచలమైన అంకితభావం యేసు క్రీస్తు శిష్యరికం యొక్క నిజమైన సారాంశానికి ఉదాహరణ.

పాస్టర్ గురుమూర్తి మాడి జీవితం సువార్త యొక్క పరివర్తన శక్తికి నిదర్శనం. ఒడిశాలోని మల్కన్‌గిరి ప్రాంతంలో తన పరిచర్య ద్వారా, గొప్ప పరివర్తన జీవితాన్ని అనుభవించి ఇతరులకు అతని కరుణాపూరిత సేవ అనేకులతో సహా స్థానిక పోలీసులకు లొంగిపోయిన మాజీ నక్సల్ కమాండర్లతో పాటు లెక్కలేనన్ని పేద ప్రజల జీవితాలను మార్చగలిగాడు.

ఏది ఏమైనప్పటికీ, పాస్టర్ మాడి సువార్త పట్ల విశ్వాసం మరియు తోటి విశ్వాసులకు తాను చేసిన సేవ, కొందరు నక్సల్ నాయకుల ఆగ్రహానికి కారణమైంది. వారు అతనిని ఎదో ఒకరోజు హతమార్చాలని పన్నాగం పన్నారు. ఆసన్నమైన ప్రమాదం ఉన్నప్పటికీ, పాస్టర్ మాడి నిస్సహాయతలో ఉన్నవారికి నిరీక్షణ మరియు రక్షణ యొక్క మార్గదర్శిని అని తెలుసుకుని, దేవుని వాక్యాన్ని ధైర్యంగా వ్యాప్తి చేయడం కొనసాగించాడు.

ఆగష్టు 11, 2016 అర్ధరాత్రి, పాస్టర్ మాడిపై మత ఛాందసవాదులు దారుణంగా దాడి చేసి కాల్చి చంపారు, దుఃఖంలో ఉన్న కుటుంబం మరియు సమాజం శోకసంద్రంలో మునిగిపోయింది. సువార్త కొరకు తన ప్రాణాలను అర్పించడానికి అతని సుముఖత త్యాగపూరిత ప్రేమకు మరియు క్రీస్తుపై అచంచలమైన విశ్వాసానికి శక్తివంతమైన ఉదాహరణగా పనిచేస్తుంది.

" నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము." - ఫిలిప్పీయులు 1:21

అతని భూసంబంధమైన జీవితం విషాదకరంగా ముగించినప్పటికీ, పాస్టర్ మాడి యొక్క జీవిత సాక్ష్యం తన పరిచర్యతో మల్కన్‌గిరి ప్రాంతంలో అనేక వ్యక్తుల జీవితాలను వెలిగించాడు. వ్యతిరేకత మరియు హింసను ఎదుర్కొన్నప్పటికీ, క్రీస్తు ప్రేమను ఇతరులతో పంచుకోవడానికి మన స్వంత అంకితభావాన్ని పరిశీలించమని అతని ధైర్యం మనలను సవాలు చేస్తుంది.

పాస్టర్ గురుమూర్తి మాడి జీవితం మరియు త్యాగం మనల్ని ధైర్యంగా సువార్తను ప్రకటించడానికి మరియు కష్టాల మధ్య కూడా దేవుని బలం మరియు సామర్థ్యాన్ని విశ్వసిస్తూ మన విశ్వాసంలో స్థిరంగా నిలబడటానికి మనల్ని స్ఫూర్తినిస్తుంది. సువార్తను వ్యాప్తి చేయడం మరియు అందరికీ క్రీస్తు ప్రేమను ప్రదర్శించడం వంటి జీవితాలుగా కలిగియుండులాగున దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. ఆమెన్.

Telugu Audio:https://youtu.be/xhNWmG6LJDY

40 Days - Day 40. Pastor Gurumurthy Madi, A Martyr for the Gospel

The memory of Pastor Gurumurthy Madi-s courageous sacrifice continues to echo in the hearts of believers, inspiring them to stand firm in their faith and commitment to sharing the Gospel, even in the face of persecution and danger. His unwavering dedication to serving others and fearlessly proclaiming the love of Christ exemplifies the true essence of discipleship.

Pastor Madi-s life was a testament to the transformative power of the Gospel. Through his ministry in Malkangiri, Odisha, he touched the lives of countless needy individuals, including former Naxal commanders who surrendered themselves to the local police after experiencing Pastor Madi-s transformed life and witnessing his compassionate service to others.

However, Pastor Madi-s commitment to the Gospel and his refusal to betray fellow believers drew the ire of Naxal leaders, who placed him on their hit list. Despite the imminent danger, Pastor Madi continued to boldly spread the Word of God, knowing that he was a beacon of hope and salvation to those in need.

On the fateful night of August 11, 2016, Pastor Madi was brutally attacked and shot by religious fanatics, leaving behind a grieving family and a community in mourning. His willingness to lay down his life for the sake of the Gospel serves as a powerful example of sacrificial love and unwavering faith in Christ.

"For to me, to live is Christ and to die is gain." - Philippians 1:21

Though his earthly life was tragically cut short, Pastor Madi-s legacy lives on in the hearts of those he touched with his ministry and in the continued spread of the Gospel in Malkangiri and beyond. His courageous witness challenges us to examine our own dedication to sharing the love of Christ with others, even when faced with opposition and persecution.

May Pastor Gurumurthy Madi-s life and sacrifice inspire us to boldly proclaim the Gospel and stand firm in our faith, trusting in God-s strength and provision, even in the midst of adversity. May we honor his memory by continuing his work of spreading the Good News and demonstrating Christ-s love to all.

English Audio: https://youtu.be/k2GGRNmD1wA

Share this post