Skip to Content

క్రీస్తులో విశ్వాసం యొక్క పరివర్తన శక్తికి సాక్షి. సిలువ సాక్షి - ఫిలిప్పు

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: 40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
  • Reference: Sajeeva Vahini

40 Days - Day 12క్రీస్తులో విశ్వాసం యొక్క పరివర్తన శక్తికి సాక్షి. సిలువ సాక్షి - ఫిలిప్పు

యోహాను 14:9 యేసు - ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?

యేసు శిష్యుడైన ఫిలిప్పుక్రీస్తును కలుసుకోవడం వల్ల కలిగే పరివర్తన ప్రభావాన్ని మరియు ఆయన మార్గదర్శకత్వాన్ని నమ్మకంగా అనుసరించడంలో తన విధేయతను ప్రదర్శించాడు. యేసుతో ఫిలిప్పు ప్రయాణం ఒక అద్భుతమైన ఆహ్వానంతో ప్రారంభమైంది. యేసు ఫిలిప్పును కనుగొని అతనితో, "నన్ను వెంబడించుము" (యోహాను 1:43) అని అడిగినప్పుడు, సందేహం లేకుండా, ఫిలిప్పు యేసు పిలుపుకు ప్రతిస్పందించాడు మరియు అతని సన్నిహిత శిష్యులలో ఒకడయ్యాడు.

యేసును అనుసరిస్తున్నప్పుడు, ఫిలిప్పు అనేక అసాధారణమైన అద్భుతాలు మరియు బోధనలకు సాక్షిగా నిలిచాడు, దేవుని రాజ్యంపై విశ్వాసాన్ని బలపరిచింది. ఐదు రొట్టెలు రెండు చేపలను ఐదు వేలమందికి ఆహారం పంచిపెట్టే సమయంలో తన సంశయం విశ్వాసానికి దారితీసింది మరియు అనేక స్వస్థతలను కళ్ళారా చూడగలిగాడు. గుమిగూడిన జనసమూహానికి ఎలా ఆహారం ఇస్తారని యేసు ఫిలిప్పును అడిగినప్పుడు, ఫిలిప్పు విశ్వాసం పరీక్షించబడింది. ప్రేమలో, విశ్వాసంలో ఎలా ఉండాలో, వాటి గురించి యేసు చెప్పిన లోతైన బోధనలను కూడా అనుకరించాడు ఫిలిప్పు. అతని ప్రారంభ ప్రతిచర్య సందేహం, యేసు సామర్థ్యాలపై ఆధారపడకుండా మానవ సామర్థ్యాల పరిమితులపై ఆధారపడింది. అయితే, అనిశ్చితిలో ఉన్న ఆ సమయంలో కూడా, ఫిలిప్పు రొట్టెలు మరియు చేపలను యేసు ద్వారా పొందిన లెక్కకు మించిన ఆశీర్వాదాన్ని చూశాడు, జనసమూహానికి తగినంత ఆహారాన్ని అందించాడు.

యేసు పునరుత్థానం తరువాత, ఫిలిప్పు సువార్త విషయంలో అడుగులు ముందుకు వేసాడు. ఆది సంఘంలో ప్రముఖ వ్యక్తిగా తన పాత్రలో, విస్తృతంగా ప్రయాణించాడు, సువార్తను వెదజల్లి నమ్మిన వారికి బాప్తిస్మం ఇచ్చాడు. దాదాపు క్రీ.శ 80లో ఫిలిప్పు మరియు అతని సోదరి మరియమ్నే బార్తోలోమయితో కలిసి గ్రీసు, ఫుగ్రియా మరియు సిరియాలో సువార్త పరిచర్య చేయడం చరిత్రలో గమనించగలం. చివరికి హిరాపోలిస్‌లో ఫిలిప్పు సిలువ వేయబడి శిరచ్ఛేదం చేయబడ్డాడు.

ఫిలిప్పు యొక్క అంకితభావం మరియు అచంచలమైన విశ్వాసం ప్రశంశనీయమైనది. అట్టి విశ్వాస విధేయత కలిగిన జీవితాలు యేసు క్రీస్తు పిలుపుకు ప్రతిస్పందించేలా ప్రేరేపిస్తాయి. ఫిలిప్పు వలే మనం దేవుని నడిపింపు పై ఆధారపడాలి. మన సౌకర్యాన్ని విడిచిపెట్టడం లేదా మన సందేహాలను అధిగమించడం వంటివి ఉన్నప్పటికీ, యేసును అనుసరించడానికి ఫిలిప్పు యొక్క అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నిద్దాం.దేవుడు తన ప్రణాళికలను నెరవేర్చడానికి, ప్రపంచంలో తన ప్రభావాన్ని విస్తరించడానికి మన విధేయతను ఉపయోగిస్తాడు, నమ్మకంగా ఇతరులతో సువార్తను ధైర్యంగా పంచుకోవడంలో ఫిలిప్పు తనవంతు కృషి చేసాడు.

ఫిలిప్పు యొక్క ధైర్యసాహసాలచే ప్రేరేపించబడిన మనం, విశ్వాసంతో సువార్తను ఇతరులతో పంచుకుందాం. దేవుడు తన చిత్తాన్ని మరింతగా కొనసాగించడానికి, ఆయన రాజ్యాన్ని విస్తరించడానికి మనల్ని ఒక శక్తివంతమైన  వానిగా సిద్ధపరచును గాక. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/iKuS8AJlAAE?si=tP7_PDXTY9uxVnz1

40 Days - Day 12 Philip: Witness to the Transformative Power of Faith in Christ

"Jesus answered him, -Philip, I have been with you for a long time. Do you still not know me? Whoever has seen me has seen the Father.-" - John 14:9

Philip, a disciple of Jesus, embodies the transformative impact of meeting Christ and the significance of faithfully following His guidance. 

Philip-s journey with Jesus began with a simple yet profound invitation. Jesus found Philip and said to him, "Follow me" (John 1:43). Without hesitation, Philip responded to the call of Jesus and became one of His closest disciples.

While following Jesus, Philip was a witness to many extraordinary miracles and teachings that strengthened his belief and comprehension of the Kingdom of God. He watched Jesus miraculously feed a large group of people with limited food and witnessed healings. He also listened to Jesus- profound teachings about love, faith, and being a follower. 

When Jesus asked Philip how they would feed the vast crowd that had gathered, Philip-s faith was tested. His initial reaction was to doubt, dwelling on the limits of human capabilities rather than relying on Jesus- abilities. However, even in that moment of uncertainty, Philip got to witness the miraculous multiplication of the loaves and fish by Jesus, providing ample food for the crowd.

Following Jesus- resurrection, Philip remained committed to spreading the Gospel. In his role as a prominent figure within the early church, he journeyed extensively, delivering the message of Jesus and baptizing those who believed.  During 80AD Philip and his sister Mariamne together with Bartholomew preached in Greece, Phrygia, and Syria. He was crucified and beheaded in Hierapolis.

Philip-s dedication and unwavering faith inspire us to answer Jesus- call with loyalty and obedience. We should rely on His guidance and support, just as Philip did. May we emulate Philip-s willingness to follow Jesus, even when it involves leaving behind our comfort or overcoming our skepticism.

Let us emulate Philip in courageously sharing the Gospel with others, confident that God will use our obedience to fulfill His plans and extend His influence in the world.

May we, inspired by Philip-s boldness, confidently share the Gospel with others, believing that God will empower our actions to further His will and expand His kingdom. Amen.

English Audio: https://youtu.be/-kbhHb91cTk?si=hv44wra7-_L2O6ga

SajeevaVahini.com 


Share this post