Skip to Content

క్రైస్తవ చరిత్రలో ధైర్యం మరియు త్యాగపూరిత విశ్వాసానికి చిహ్నం - టార్సిసియస్

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: 40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
  • Reference: Sajeeva Vahini

40 Days - Day 21

క్రైస్తవ చరిత్రలో ధైర్యం మరియు త్యాగపూరిత విశ్వాసానికి చిహ్నం - టార్సిసియస్

టార్సిసియస్, క్రైస్తవ చరిత్రలో అంతగా ప్రసిద్ధిగాంచిన వాడు కాదు. అయినప్పటికీ, ధైర్యం, నిస్వార్థత మరియు క్రీస్తు పట్ల అచంచలమైన విశ్వాసం యొక్క సద్గుణాలను కలిగి ఉన్నాడు. విశ్వాసులు దేవునితో వారి నడకలో అనుకరించడానికి పిలువబడే త్యాగపూరిత ప్రేమ మరియు సమర్పణకు అతని జీవితం శక్తివంతమైన ఉదాహరణగా పనిచేస్తుంది.

ఆనాడు రోమాలో క్రైస్తవులకు వ్యతిరేకంగా తీవ్రమైన హింసకు గురవుతున్న కాలంలో, టార్సిసియస్ అనే 12 సం. వయసు గల బాలుడు, దేవుని బల్ల వద్ద సేవకుడిగా సేవ చేయడానికి ధైర్యంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. కొంతమంది ఖైదు చేయబడిన క్రైస్తవులు, ఇంకా కొద్ది రోజుల్లో శిక్షించడానికి రోమా ప్రభుత్వం సిద్ధం చేస్తున్న సమయంలో, వారు దేవుని బల్ల లో పాల్గొనే ఒక తరుణం కోసం ఎదురు చూస్తున్న సమయం అది. ఆ సమయంలో చిన్నవాడైన  టార్సిసియస్ కు దేవుని బల్లను తీసుకెళ్లే పవిత్ర బాధ్యతను అప్పగించారు ఆ సంఘ నాయకులు. తన చుట్టూ ఉన్న ఘోర ప్రమాదం గురించి తెలుసుకున్న టార్సిసియస్ తనకు అప్పజెప్పిన పని యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాడు మరియు బాధ్యతను ఇష్టపూర్వకంగా అంగీకరించాడు.

ఖైదు చేయబడిన క్రైస్తవుల వద్దకు టార్సిసియస్ దేవుని బల్లను తీసుకువెళుతుండగా, అతను ఏమి తీసుకువెళుతున్నాడో తెలుసుకోవాలని కొదంరు అన్యమత యువకులు కుమ్మక్కైయ్యారు. అదే సమయంలో తన సంచిలో ఉన్న దేవుని బల్లను బయటకు తీయకుండా దాచి పెట్టి వారి ముందు సవాలుగా నిలిచిపోయాడు.

కోపంతో, ఆ యువకులు టార్సిసియస్‌పై దాడి చేసి, అతనికి ప్రాణాపాయం కలిగించారు. దేవుని బల్లను పడవేయకుండా దానిని కాపాడే క్రమంలో తనకు అప్పజెప్పిన బాధ్యత విషయంలో వెనుకంజ వేయలేదు. చివరికి ఆ యువకులు ఆ బాలుడు తన చేతిలో ఉన్న సంచి వదిలెంత వరకు కొట్టగా. అక్కడికక్కడే ఆ బాలుడు తన ప్రాణాన్ని విడిచి హతసాక్షి అయ్యాడు.

తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు.యోహాను 15:13క్రీస్తు పట్ల టార్సిసియస్ యొక్క అచంచలమైన విశ్వాసం, దేవుని పట్ల మన స్వంత భక్తిని మరియు ఇతరుల కొరకు త్యాగం చేయడానికి ఇష్టపడడాన్ని పరిగణించమని సవాలు చేస్తుంది. వ్యతిరేకత లేదా హింసను ఎదుర్కొన్నప్పుడు కూడా మన విశ్వాసంలో స్థిరంగా నిలబడేందుకు మనం సిద్ధంగా ఉన్నామా? ఇతరులతో మన పరస్పర చర్యలలో త్యాగపూరిత ప్రేమ మరియు నిస్వార్థతను ప్రదర్శిస్తామా?

టార్సిసియస్ వలే, మన విశ్వాసాన్ని ధైర్యంగా మరియు దృఢ నిశ్చయంతో సాక్ష్యమివ్వడానికి సిద్ధంగా ఉందాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు అడుగుజాడలను అనుసరించి, ఇతరులకు త్యాగపూరిత ప్రేమ మరియు వినయంతో ఇతరులకు సేవ చేసేందుకు అన్నింటికంటే దేవునితో మన సంబంధానికి ప్రాధాన్యత ఇవ్వడానికి అతని ఉదాహరణ మనకు స్ఫూర్తినిస్తుంది. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/_cNhFsLS1yE?si=bfjG0xAdhTpG0wpn

40 Days - Day 21.  Tarcisius: A Symbol of Courage and Sacrificial Devotion in Christian History

Tarcisius, though a lesser-known figure in Christian history, embodies the virtues of courage, selflessness, and unwavering devotion to Christ. His life serves as a powerful reminder of the sacrificial love and commitment that believers are called to emulate in their walk with God.

During a period of intense persecution against Christians in ancient Rome, Tarcisius, a 12yr old young boy, bravely volunteered to serve as an altar server, entrusted with the sacred duty of carrying the Eucharist (Holy Communion) to imprisoned Christians awaiting martyrdom. Aware of the grave danger that awaited him, Tarcisius understood the importance of his mission and willingly accepted the responsibility.

As Tarcisius carried the consecrated host to the imprisoned Christians, he encountered a group of pagan youths who demanded to know what he was carrying. Despite their threats and intimidation, Tarcisius steadfastly refused to reveal the sacred contents of his pouch, choosing to protect the Eucharist (Holy Communion)  with his life.

In a fit of rage, the pagan youths attacked Tarcisius, inflicting mortal wounds upon him. Rather than surrendering the Eucharist (Holy Communion) or renouncing his faith, Tarcisius bravely clung to his beliefs until his last breath, he was beaten to death and he became a martyr for the Christian faith.

"Greater love has no one than this: to lay down one’s life for one’s friends." - John 15:13

Tarcisius- unwavering commitment to Christ challenges us to consider our own devotion to God and willingness to sacrifice for the sake of others. Are we willing to stand firm in our faith, even when faced with opposition or persecution? Do we demonstrate sacrificial love and selflessness in our interactions with others?

Like Tarcisius, may we be willing to bear witness to our faith with courage and conviction, even at great personal cost. May his example inspire us to prioritize our relationship with God above all else and to serve others with sacrificial love and humility, following in the footsteps of our Savior, Jesus Christ. Amen.

English Audio: https://youtu.be/ZpEY3Lp3epY?si=w6vPinryfT9XVVix

SajeevaVahini.com 


Share this post