- Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
- Category: 40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
- Reference: Sajeeva Vahini
40 Days - Day 19
హింసల మధ్య ధైర్యం, విశ్వాసానికి నిదర్శనం – హతసాక్షి - అపోలోనియా
అపోలోనియా క్రీ.శ. 3వ శతాబ్దంలో అలెగ్జాండ్రియాలో నివసిస్తున్న ఒక క్రైస్తవ మహిళ, రోమా సామ్రాజ్యంలో క్రైస్తవులపై తీవ్రమైన హింసకు గురైన సమయం అది. అనేక హింసలు ఉన్నప్పటికీ, అపోలోనియా క్రీస్తు పట్ల తన విశ్వాసంలో స్థిరంగా నిలబడింది, హింస మరియు మరణాన్ని ఎదుర్కొన్నప్పుడు కూడా తన విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు.
ముఖ్యంగా కౄరమైన హింస సమయంలో, అపోలోనియాను అన్యమతస్తుల గుంపు ఆమెను బంధించి, ఆమె క్రీస్తుపై తన విశ్వాసాన్ని తిరస్కరించాలని వేధించారు. ఆమె నిరాకరించినప్పుడు, ఆ గుంపు ఆమెను అనూహ్యమైన హింసకు గురిచేసింది, అందులో ఆమె దంతాలను విరగగొట్టి, పళ్ళను తొలగించడం కూడా జరిగింది. భరించలేని బాధాకరమైన నొప్పి, బాధలు ఉన్నప్పటికీ, అపోలోనియా తన విశ్వాసంలో స్థిరంగా ఉండిపోయింది. క్రీస్తును తన ప్రభువని, రక్షకునిగా తన విశ్వాసాన్ని అంటిపెట్టుకుని నిలబడింది. హింస నుండి తప్పించుకోవడానికి తన విశ్వాసాన్ని వదులుకునే బదులు, ఆమె ఇష్టపూర్వకంగా తనకోసం సిద్ధపరచిన మంటల్లోకి దూకి ప్రాణత్యాగానికి గురై హతసాక్షి అయింది.
యెషయా 41:10 - “నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.”
అపోలోనియా యొక్క ధైర్యం మరియు హింసను ఎదుర్కొనే దృఢత్వం, క్రీస్తు పట్ల మనలోని విశ్వాసం యొక్క లోతును పరిశీలించడానికి మనల్ని సవాలు చేస్తుంది. వ్యతిరేకత లేదా బాధలను ఎదుర్కొన్నప్పటికీ, మన విశ్వాసాలలో స్థిరంగా నిలబడేందుకు మనం సిద్ధంగా ఉన్నామా? మనల్ని నిలబెట్టడానికి మరియు మనం ఎదుర్కొనే పరీక్షల ద్వారా మనల్ని నడిపించడానికి దేవుని బలంపై మనం విశ్వసిస్తున్నామా?
అపోలోనియా వలె, కష్ట సమయాల్లో ఆయన మనకు ఆశ్రయం మరియు బలం అని తెలుసుకుని, క్రీస్తుతో మన సంబంధంలో బలాన్ని మరియు ధైర్యాన్ని పొందుదాం. కష్టాలను ఎదుర్కొన్నప్పుడు కూడా మన విశ్వాసంలో స్థిరత్వం కావాలంటే ప్రతి పరీక్షలో, శ్రమలో క్రీస్తుపై సంపూర్ణంగా ఆధారపడే సిద్ధపాటు కావాలి. అట్టి అనుభవాలకు అపోలోనియా జీవితం నేడు మనల్ని ప్రేరేపిస్తుంది. ఆమెన్.
Telugu Audio: https://youtu.be/emhNXC2as1o
40 Days - Day 19
Apollonia: A Testament of Courage and Faith Amidst Persecution
Apollonia was a Christian woman living in Alexandria during the 3rd century AD, a time of intense persecution against Christians in the Roman Empire. Despite the risks involved, Apollonia remained steadfast in her commitment to Christ, refusing to renounce her faith even when faced with torture and death.
During a particularly brutal wave of persecution, Apollonia was seized by a mob of pagan extremists who demanded that she deny her faith in Christ. When she steadfastly refused, the mob subjected her to unimaginable torture, including the cruel removal of her teeth. Despite the excruciating pain and suffering she endured, Apollonia remained resolute in her faith, clinging to her belief in Christ as her Lord and Savior. Rather than renounce her faith to escape the torture, she jumped willingly into the flames and so suffered martyrdom.
Do not fear, for I am with you; do not be dismayed, for I am your God. I will strengthen you and help you; I will uphold you with my righteous right hand." - Isaiah 41:10
Apollonia-s courage and steadfastness in the face of persecution challenge us to examine our own commitment to Christ and the depth of our faith. Are we willing to stand firm in our beliefs, even when faced with opposition or suffering? Do we trust in God-s strength to sustain us and carry us through the trials we may encounter?
Like Apollonia, may we find strength and courage in our relationship with Christ, knowing that He is our refuge and strength in times of trouble. May her example inspire us to remain steadfast in our faith, even when confronted with adversity, and to trust in the power of Christ to sustain us through every trial. Amen.
English Audio:https://youtu.be/9yb1AWCL0RE
SajeevaVahini.com