Skip to Content

దేవుని రూపాంతర అనుభవాల నిదర్శనం - అపోస్తలుడైన పౌలు |

7 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: 40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
  • Reference: Sajeeva Vahini

40 Days - Day 5

దేవుని రూపాంతర అనుభవాల నిదర్శనం - అపోస్తలుడైన పౌలు

దేవుని కృప ద్వారా ఎటువంటి జీవితాన్నైనా మార్చగల శక్తివంతమైనదనుటకు అపొస్తలుడైన పౌలు యొక్క జీవితం ఒక అద్భుతమైన కథ. విశ్వాసులను వేధించే వ్యక్తి నుండి నమ్మకమైన అపొస్తలుని వరకు, పౌలు యొక్క ప్రయాణం, సజీవుడైన క్రీస్తును ఎదుర్కొన్న సంఘటన, అతనికి కలిగిన లోతైన పరివర్తనను ప్రతిబింబిస్తుంది. 

తార్సుకు చెందిన సౌలుగా తన ప్రారంభ రోజుల్లో, పౌలు - తొలి క్రైస్తవులను తీవ్రంగా హింసించినందుకు అపఖ్యాతిని పొందాడు. కానీ దమస్కుకు వెళ్లే మార్గంలో తన జీవితంలో రూపావళి మార్పు కలిగింది. ఎప్పుడైతే పునరుత్థానుడైన యేసు ముఖదర్శనం కలిగిందో అప్పుడే అంధుడయ్యాడు. ఆ క్షణంలో, పాపం యొక్క వాస్తవికతను ఎదుర్కొని, యేసు క్రీస్తే నిజమైన ప్రభువని గుర్తించవలసి వచ్చింది.ప్రవక్తయైన అననీయ చేత, పరిశుద్ధాత్మ ద్వారా, పౌలు యొక్క కళ్ళు భౌతికంగా ఆధ్యాత్మికంగా తెరవబడ్డాయి. బాప్తీస్మములో పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. నాశనం చేయాలని కోరిన సువార్తను, ఇప్పుడు అనేకులకు వ్యాప్తి చేయడానికి అంకితమైన కొత్త జీవితాన్ని ప్రారంభించాడు.

 పౌలు జీవితం - తన బలమైన సాక్ష్యంతో మొదలై, అతరంగంలో దేవుని విషయంలో కలిగియున్న తీవ్రతతో, క్రీస్తును గూర్చిన విశ్వాసం జతచేయబడినప్పుడు, అది ఒక శక్తివంతమైన నిదర్శనంగా మారిపోయింది. లెక్కలేనన్ని పరీక్షలు, కష్టాలు ఎదురైనప్పటికీ, హింస, జైలుశిక్ష లేదా ఓడ బ్రద్ధలైన సందర్భాలు ఎదుర్కొన్నప్పటికీ, పౌలు తన అచంచల విశ్వాసంలో స్థిరంగా నిలబడగలిగాడు. నిర్భయంగా, అనేకులకు సువార్తను ప్రకటించాడు, వారి నేపథ్యంతో సంబంధం లేకుండా, సంఘాలను స్థాపించి, నేటి విశ్వాసులకు మార్గనిర్దేశం చేసే ఎన్నో పత్రికలను వ్రాయడం మొదలుపెట్టాడు. అయితే, చెరిత్రలో పౌలు మరణం గూర్చి ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదు, కానీ అతను రోమాలో శిరచ్ఛేదం చేయబడ్డాడని, క్రీస్తు కొరకు అమరవీరుడుగా మరణించాడని కొన్ని పుస్తకాలలో వ్రాయబడ్డాయి. అతని మరణం బహుశా క్రీ.శ.64 లో ఆనాడు రోమా నగరంలో జరిగిన గొప్ప అగ్నిప్రమాదం తరువాత రోమా చక్రవర్తి నీరో ఆదేశించిన క్రైస్తవుల మరణశిక్షలలో ఇది కూడా భాగమై ఉండవచ్చు.

ప్రియ స్నేహితులారా, ఆనాటి పౌలు యొక్క బోధలు మరియు చర్యలు క్రీస్తుకు మన స్వంత అంకితభావాన్ని అంచనా వేయడానికి సవాలుగా ఉన్నాయి. అపో పౌలు తన అనుభావాలను వ్రాస్తూ “గలతియులకు 2:20నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసమువలన జీవించుచున్నాను”.

అసలు, సువార్త వ్యాప్తి కోసం మనం అన్నిటినీ వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? క్లిష్ట పరిస్థితులలో మనల్ని నడిపించే దేవుని అచంచలమైన శక్తిపై మనకు పూర్తి నమ్మకం ఉందా? ఇటువంటి భావాలు ఉన్నప్పుడే - పౌలు వలే మనం కూడా దేవునికొరకు పనిచేసే పాత్రగా, పరిశుద్ధాత్మ ద్వారా మార్గనిర్దేశం చేయబడే ఎన్నో ప్రణాళికలకు, మనం పూర్తిగా లొంగిపోవడానికి సిద్ధంగా ఉంటాము.

నేనంటాను, పౌలు జీవిత సాక్ష్యం ద్వారా, దేవుని అద్భుతమైన కృపకు ఎవరూ అతీతం కాదు. అతని అద్భుతమైన పరివర్తన, అనర్హులుగా భావించే మనకు ఆశాజ్యోతిగా సహాయపడుతుంది. దేవుని కృప అన్ని పరిమితులను అధిగమిస్తుందని, ఇతరులకు సేవ చేసే అర్ధవంతమైన జీవితాన్ని పునరుద్ధరించడానికి, మార్చడానికి మరియు మనల్ని సన్నద్ధం చేసే శక్తిని కలిగి ఉందని గ్రహిద్దాం. దేవుని కృప మీపై మెండుగా కుమ్మరించబడును గాక. ఆమెన్. 

Telugu Audio: https://youtu.be/rJTFmPR41Rk

40 Days - Day 5

Paul : From Persecutor to Apostle - A Testament of God-s Transformative Grace

"I have been crucified with Christ and I no longer live, but Christ lives in me. The life I now live in the body, I live by faith in the Son of God, who loved me and gave himself for me." - Galatians 2:20

The incredible story of the apostle Paul serves as a powerful reminder of the life-changing impact of God-s grace. Paul-s journey, from persecutor to faithful apostle, epitomizes the profound transformation that happens when one encounters the living Christ. In his early days as Saul of Tarsus, Paul gained notoriety for his fierce persecution of early Christians. 

But everything changed for him on the road to Damascus. It was there that he came face to face with the resurrected Jesus and was blinded by the overwhelming presence of Christ. In that moment, Paul was forced to confront the reality of his sin and acknowledge the true lordship of Jesus.

Through the ministry of Ananias and the Holy Spirit, Paul-s eyes were opened both physically and spiritually. He was baptized and filled with the Holy Spirit, embarking on a new life devoted to spreading the Gospel he once sought to destroy.

Paul-s life became a powerful testament to his unyielding devotion and fervent zeal for Christ and His mission. In the face of countless trials and tribulations, including persecution, imprisonment, and even shipwrecks, Paul remained steadfast in his unwavering faith. Fearlessly, he proclaimed the Good News to all people, regardless of their background, planting churches and penning letters that continue to guide and inspire believers today. However, Paul-s death was unknown, but tradition holds that he was beheaded in Rome and thus died as a martyr for his faith. His death was perhaps part of the executions of Christians ordered by the Roman emperor Nero following the great fire in the city in 64 AD.

Paul-s teachings and actions pose a challenge for us to evaluate our own dedication to Christ. Are we prepared to relinquish everything for the sake of spreading the Gospel? Are we confident in God-s unwavering strength to carry us through difficult circumstances? May we, like Paul, be open to being used by God and fully surrendered to His plans, guided by His Spirit. 

Through Paul-s testimony, we are reminded that no one is beyond the reach of God-s amazing grace. His remarkable transformation serves as a beacon of hope for those who may feel unworthy or unqualified. God-s grace surpasses all limitations and has the power to restore, change, and equip us for a meaningful life of serving others.

English Audio: https://youtu.be/8CK8m9mejM4

SajeevaVahini.com 


Share this post