Skip to Content

అనేకులను క్రీస్తువైపు నడిపించిన సిలువ సాక్షి, హతసాక్షి - అంద్రెయ

  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: 40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
  • Reference: Sajeeva Vahini

40 Days - Day 6

అనేకులను క్రీస్తువైపు నడిపించిన సిలువ సాక్షి, హతసాక్షి - అంద్రెయ

యోహాను 1:41 ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సీయను కనుగొంటి మని అతనితో చెప్పి

అంద్రెయ - అత్యంత ప్రసిద్ధగాంచిన సీమోను పేతురు తోబుట్టువు. ఇతను ఆది సంఘ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు మరియు క్రీస్తు పట్ల అతని అసమానమైన విధేయత కాదనలేనిది. అంద్రెయ యొక్క జీవితం - ఒక వ్యక్తి తన దృఢమైన విశ్వాసం మరియు నిస్సందేహమైన విధేయత ద్వారా కలిగి ఉండే అద్భుతమైన ప్రభావానికి బలమైన సాక్ష్యంగా పనిచేస్తుంది.

యేసుతో పాటు అంద్రెయ యొక్క అద్భుతమైన ప్రయాణం బాప్తీస్మమిచ్చు యోహాను యొక్క బోధనలను బహిర్గతం చేయడం ద్వారా ప్రారంభించబడింది. బలమైన పిలుపు ద్వారా ఆకర్షించబడిన అంద్రెయ, దేవునికి అత్యంత భక్తికలిగిన అనుచరుడయ్యాడు. యేసును ముఖాముఖిగా కలుసుకున్నాడు. యేసు క్రీస్తును దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మెస్సీయగా గుర్తించిన అంద్రెయ, "మేము మెస్సీయను కనుగొంటిమి" (యోహాను 1:41) అంటూ తన సోదరుడైన పేతురుతో ఈ శుభవార్తను పంచుకోవడంలో సమయాన్ని వృథా చేయలేదు.

సువార్తలలో, అంద్రెయ ఒక ప్రత్యేకించబడిన శక్తిగా చిత్రీకరించబడ్డాడు, ప్రజలను యేసుతో అద్భుతంగా దగ్గరికి చేర్చాడు. పేతురును యేసుకు పరిచయం చేయడంలో, ఐదువేల మందికి ఆహారం అందించడం కోసం ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఉన్న కొద్ది సదుపాయాలను వినియోగించడంలో తన ప్ర్రత్యేకతను చాటుకున్నాడు. గ్రీకులను క్రీస్తువైపు మళ్ళించడంలో అతని కీలక పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. అంద్రెయ యొక్క ప్రధాన దృష్టి ఇతరులను మెస్సీయ వైపుకు నడిపించడమే. దాదాపు క్రీ.శ 60 సమయంలో పత్రాసులో సిలువ వేయడం ద్వారా హతసాక్షి అయ్యాడు. చరిత్రను బట్టి, అతను ఒక శిలువకు బంధించబడ్డాడు. "క్రక్స్ డెకస్సాటా" అని పిలువబడే క్రాస్ రూపంలో సిలువ వేయబడ్డాడు, ఇది X- ఆకారపు క్రాస్ లేదా "సాల్టైర్" అని గ్రహించగలం.

ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి కానప్పటికీ, అంద్రెయ యేసు పక్కనే స్థిరంగా నిలబడ్డాడు, అతని అసాధారణ పనులకు సాక్ష్యమిచ్చాడు, క్రీస్తు బోధనలను శ్రద్ధగా గ్రహించాడు మరియు రక్షకుని యొక్క అనంతమైన ప్రేమలో అంతంవరకు ఆనందించాడు. ఒక సేవకునికి ఉండవలసిన హృదయం, వినయంతోపాటు  క్రీస్తు పట్ల అచంచలమైన భక్తితో, అతను అన్ని వయసుల విశ్వాసులకు ఆదర్శప్రాయమైన వాడిగా చరిత్రలో నిలిచిపోయాడు.

అవును ప్రియమైన వారలారా, అంద్రెయ జీవితం మనకు స్పూర్తిదాయకామని గ్రహించినప్పుడు, మన స్వంత మాటలు, పనులు మరియు సంబంధాల ద్వారా ఇతరులను యేసు వైపుకు నడిపించడంలో అతని సాహసోపేతమైన చర్యలను మనం కూడా ఎలా అనుకరించవచ్చో ఆత్మపరిశీలన చేసుకోడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనకున్న సామాజిక స్థాయి లేదా ప్రతిభ కంటే - మనమందరం అంద్రెయ అడుగుజాడలను అనుసరిస్తూ, ఇతరులను క్రీస్తు ప్రేమ వైపు నడిపించడం ద్వారా నిత్యరాజ్యానికి అర్ధవంతమైన ప్రభావాన్ని చూపవచ్చు.

కాబట్టి,  మనందరం ఒక సవాలుగా, అంద్రెయ యొక్క ప్రకాశవంతమైన ఉదాహరణను ధైర్యంగా అనుసరిద్దాం. మనతోటి వారికి ఈ సువార్త సందేశాన్ని నిర్భయంగా వ్యాప్తి చేద్దాం. అచంచలమైన విశ్వాసం మరియు దేవునితో సంపూర్ణ సమర్పణలో, మన హృదయపూర్వక ప్రయత్నాలు ఇతరులను ఆయనతో జతచేస్తూ వారి  జీవితాలను మార్చే సంబంధానికి దారితీస్తాయని విశ్వసిద్దాం. అట్టి విశ్వాస అడుగులు ముందుకు వేసే ఆలోచనలు దేవుడు మనందరికీ దయజేయును గాక. ఆమెన్.

Telugu Audio: https://www.youtube.com/watch?v=kKBa0J2s660

40 Days - Day 6.Andrew: Bringing Others to Christ - A Martyr-s Legacy of Faithfulness

"The first thing Andrew did was to find his brother Simon and tell him, -We have found the Messiah- (that is, the Christ)." - John 1:41

Despite living in the shadow of his more well-known sibling Simon Peter, Andrew played a crucial role in the development of the early church and his unparalleled allegiance to Christ is undeniably noteworthy. His tale serves as a compelling testament to the incredible influence one person can have through their steadfast faith and unquestioning obedience. 

Andrew-s remarkable journey alongside Jesus was initiated by his exposure to the teachings of John the Baptist. Drawn in by the compelling message, Andrew became a devout follower and eventually found himself face to face with Jesus. Recognizing Jesus as the long-awaited Messiah, Andrew wasted no time in sharing this good news with his brother Peter, saying, "We have found the Messiah" (John 1:41).

In the Gospels, Andrew is depicted as a dynamic force, masterfully connecting people to Jesus. His pivotal role is evident in his introduction of Peter to Jesus, his humble offering of a young boy-s sparse provisions for the miraculous feeding of a multitude, and his facilitation of the encounter between Jesus and the Greeks. Andrew-s primary focus was guiding others to the Messiah.  Andrew was martyred by crucifixion in Patras during 60 AD. He was bound, rather than nailed, to a cross, as is described in the book named Acts of Andrew. He was crucified on a cross form known as "crux decussata," which is an X-shaped cross or a "saltire."

Though not in the spotlight, Andrew remained steadfastly by Jesus- side, bearing witness to His extraordinary works, attentively absorbing His teachings, and relishing in the boundless love of his Savior. With humility, a servant-s heart, and unshakable devotion to Christ, he serves as an exemplary role model for believers of all ages.

As we delve into Andrew-s inspiring story, we are reminded to introspect and consider how we too can emulate his bold actions in leading others to Jesus through our own words, deeds, and relationships. It matters not our societal rank or talents - we can all follow in Andrew-s footsteps and make a meaningful impact for the Kingdom by simply pointing others to the loving embrace of the Savior. 

So let us take up the gauntlet and boldly follow Andrew-s shining example, fearlessly spreading the message of Jesus to those we encounter. With unwavering faith and surrender to God, let us trust that our earnest efforts will guide others towards a fulfilling and life-changing relationship with Him.

English Audio: https://www.youtube.com/watch?v=G4rOWEBa990

SajeevaVahini.com 

Share this post