Skip to Content

అలుపెరుగని విశ్వాసానికి, త్యాగపూరితమైన భక్తికి సాక్షి, హతసాక్షి - అంతియోకయకు చెందిన ఇగ్నేషియస్

  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: 40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
  • Reference: Sajeeva Vahini

40 Days - Day 15

అలుపెరుగని విశ్వాసానికి, త్యాగపూరితమైన భక్తికి సాక్షి, హతసాక్షి - అంతియోకయకు చెందిన ఇగ్నేషియస్

అంతియోకయకు చెందిన ఇగ్నేషియస్ ప్రారంభ క్రైస్తవ విశ్వాసంలో ప్రముఖ వ్యక్తి, క్రీస్తు పట్ల అచంచలమైన విశ్వాసం మరియు త్యాగపూరిత భక్తికి పేరుగాంచాడు. అతని జీవితం మరియు రచనలు సువార్త యొక్క పరివర్తన శక్తికి నిదర్శనంగా పనిచేస్తూ నేటికీ విశ్వాసులను ప్రేరేపిస్తూనే ఉన్నాయి.

ఇగ్నేషియస్ క్రీస్తుశకం మొదటి శతాబ్దంలో జన్మించాడు మరియు చివరికి అంతియోకయకు బిషప్ అయ్యాడు, ఇది మొట్టమొదటిగా క్రైస్తావులు అనబడిన ప్రదేశం. క్రైస్తవులకు వ్యతిరేకంగా తీవ్రమైన హింసకు గురైన సమయంలో, ఇగ్నేషియస్ ధైర్యంగా యేసుక్రీస్తుపై తన విశ్వాసాన్ని ప్రకటించాడు, శ్రమలు హింసలను ఎదుర్కొంటున్నప్పటికీ తన విశ్వాసంపై స్థిరంగా నిలబడగలిగాడు.

క్రీ.శ 107లో, రోమీయుల దేవతలను ఆరాధించడానికి నిరాకరించినందుకు ఇగ్నేషియస్‌ని బంధించి, సింహాలకు ఆహారంగా వేసి, మరణశిక్ష విధించారు. ఇగ్నేషియస్ చివరి మాటలు మనకు స్ఫూర్తినిస్తాయి "నన్ను కౄరమృగాలకు ఆహారంగా వేయండి, దీని ద్వారా నేను నా దేవుని త్వరగా చేరుకునే లాభాన్ని పొందుకుంటాను". 

ఫిలిప్పీయులకు 1:21 నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము.

హింస నుండి పారిపోవడానికి బదులుగా, ఇగ్నేషియస్ ఇష్టపూర్వకంగా స్వీకరించాడు, తాను ఎదుర్కోబోయే హింస, క్రీస్తును మహిమపరచడానికి ఒక అవకాశంగా భావించాడు, చివరికి హతసాక్షి అయ్యాడు. ఇగ్నేషియస్ వివిధ క్రైస్తవ సంఘాలకు అనేక లేఖలు వ్రాసేవాడు, వారి విశ్వాసం మరియు ఐక్యతలో స్థిరంగా ఉండమని వారిని ప్రోత్సహించేవాడు.

ఇగ్నేషియస్ లేఖలు, "ఎపిస్టల్స్ ఆఫ్ ఇగ్నేషియస్" అని పిలుస్తారు, అవి సిద్ధాంతపరమైన స్వచ్ఛత, సంఘ అధికారులకు విధేయత మరియు హింసను ఎదుర్కొనే దృఢత్వం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం ద్వారా గుర్తించబడ్డాయి. నేనంటాను, మరణం తన ముందున్నా, ఇగ్నేషియస్ తన విశ్వాసంలో స్థిరంగా నిలబడ్డాడు, మరణం ద్వారా క్రీస్తుతో ఐక్యం కావాలనే లోతైన కోరికను వ్యక్తం చేశాడు.

ఇగ్నేషియస్ జీవితం క్రీస్తు సువార్త పట్ల మన వ్యక్తిగత విశ్వాసాన్ని సవాలు చేస్తుంది. వ్యతిరేకత లేదా హింసను ఎదుర్కొన్నప్పటికీ, మన విశ్వాసంలో స్థిరంగా నిలబడేందుకు మనం సిద్ధంగా ఉన్నామా? మనం కష్టాలను, శ్రమలను దేవుణ్ణి మహిమపరచడానికి మరియు ఆయనకు సన్నిహితంగా ఎదగడానికి అవకాశాలుగా చూస్తున్నామా?

ఇగ్నేషియస్ వలే, ఎటువంటి పరిస్థితుల్లోనైనా క్రీస్తు అనుచరులుగా మన గుర్తింపును హృదయపూర్వకంగా స్వీకరిద్దాం. అచంచలమైన విశ్వాసం మరియు త్యాగపూరిత భక్తి యొక్క ఇగ్నేషియస్ జీవితం ద్వారా మనం బలాన్ని పొంది, మనలను నిలబెట్టడానికి మరియు దేవుని మహిమ కొరకు ధైర్యంగా జీవించడానికి మనకు శక్తినివ్వడానికి ఆయన కృపలో నమ్మకంగా జీవిద్దాం. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/ZZGvkO84BBs?feature=shared

40 Days - Day 15. Ignatius of Antioch - A Testament of Unyielding Faith and Sacrificial Devotion

"For to me, to live is Christ and to die is gain." - Philippians 1:21

Ignatius of Antioch was a prominent figure in early Christianity, known for his unwavering faith and sacrificial devotion to Christ. His life and writings continue to inspire believers today, serving as a testament to the transformative power of the Gospel.

Ignatius was born in the first century AD and eventually became the bishop of Antioch, one of the leading centers of early Christianity. During a time of intense persecution against Christians, Ignatius boldly proclaimed his faith in Jesus Christ, refusing to renounce his beliefs despite facing the threat of martyrdom.

In AD 107, Ignatius was arrested and sentenced to death by throwing him to lions, for his refusal to worship the Roman gods. Ignatius last words inspires us. He said “Allow me to become food for the wild beasts, through whose means it will be granted me to reach God”.

Instead of fleeing persecution, Ignatius willingly embraced his fate, viewing it as an opportunity to glorify Christ through his martyrdom. Ignatius wrote several letters to various Christian communities, exhorting them to remain steadfast in their faith and unity.

Ignatius- letters, known as the "Epistles of Ignatius," are marked by their emphasis on the importance of doctrinal purity, obedience to church authorities, and steadfastness in the face of persecution. Despite his impending death, Ignatius remained resolute in his faith, expressing a deep longing to be united with Christ through martyrdom. 

Ignatius- life challenges us to consider our own commitment to Christ and the Gospel. Are we willing to stand firm in our faith, even in the face of opposition or persecution? Do we view trials and hardships as opportunities to glorify God and grow closer to Him?

Like Ignatius, may we embrace our identity as followers of Christ wholeheartedly, regardless of the cost. May we draw strength from his example of unwavering faith and sacrificial devotion, trusting in God-s grace to sustain us and empower us to live boldly for His glory. Amen.

English Audio: https://youtu.be/I17M4ko5gY0?feature=shared

SajeevaVahini.com 


Share this post