Skip to Content

అల్ఫయి కుమారుడగు యాకోబు | James, Son of Alphaeus

7 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: 40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
  • Reference: Sajeeva Vahini

40 Days - Day 3అల్ఫయి కుమారుడగు యాకోబు - దీన సేవకుడు, శిష్యుడు, హతసాక్షి

యేసు క్రీస్తు శిష్యుడు, అపొస్తలులలో ఒకడైన అల్ఫయి కుమారుడగు యాకోబు, అంతగా ప్రఖ్యాతి కలిగిన వ్యక్తి కానే కాదు. అయితే, ఇతను గూర్చి కొత్త నిబంధనలో చాల తక్కువగా ప్రస్తావన కలిగి ఉండకపోవచ్చు, కానీ ఇతని జీవితం ఒక స్థిరమైన విశ్వాసానికి బలపైన ఉదాహరణ.

యాకోబు యొక్క చర్యలు, మాటల గురించి పెద్దగా సమాచారం లేనప్పటికీ, ఇతను తన పన్నెండు మంది శిష్యులలో ఒకరిగా యేసుచే ఎన్నుకోబడ్డాడు. ఒక దీన సేవకునిగా పిలిచిన పిలుపుకు లోబడి, క్రీస్తుతో అడుగులు ముందుకు వేసి, యేసు క్రీస్తు చేసిన అనేక అద్భుతాలకు సాక్ష్యమిస్తూ, ఆయన బోధల నుండి నేర్చున్న సువార్తను బూధిగంతములకు ప్రకటించే అధికారాన్ని పొందుకున్నాడు.యేసు క్రీస్తు పై తనకున్న అచంచలమైన విశ్వాసం ఎన్నో కష్టమైన త్యాగాలు, లెక్కలేనన్ని పరీక్షలను ఎదుర్కోవలసి వచ్చించి. తన తోటి అపొస్తలుల మాదిరిగానే, తమ స్వంత వారే శత్రువులయ్యారు, సంశయవాదం సమాజంలో అనిశ్చిత సందర్భాలను ఎదుర్కొన్నాడు. కానీ అన్నింటి ద్వారా, అతను దేవుని రాజ్య సువార్తను అనేకులకు తెలియచేయడానికి తన తోటి శిష్యులతో కలిసి పనిచేస్తూ, పిలిచిన పిలుపును నమ్మకంగా కొనసాగించాడు.

1 కోరింథీయులకు 10:31 కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి. 

యాకోబు అనుభవాలు ఇతర అపొస్తలుల వలె మెరుగ్గా ఉండకపోయినప్పటికీ, అస్పష్టత నేపథ్యంలో అతని దృఢమైన నిబద్ధత,  జీవించిన విధానాలను గురించి ఎన్ని గ్రంధాలు వ్రాసినా సరిపోదు. బహుశా క్రీ.శ 62 లో, అనుకోకుండా ఒకరోజు యెరూషలేము ఆలయంలో బోధిస్తున్నప్పుడు యూదులు అతన్ని రాళ్లతో కొట్టి, చంపి అదే ఆలయం పక్కన సమాధి చేసారు. క్రీస్తను విశ్వసించే మనం, మన వ్యక్తిగత స్థితి లేదా గుర్తింపుతో సంబంధం లేకుండా, దేవుని రాజ్య సువార్తను మరింత ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాలని యాకోబు ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలిచిపోయాడు.

ప్రియమైన స్నేహితులారా, తరచుగా కీర్తి ప్రతిష్టలకు విలువనిచ్చే ప్రపంచంలో, దేవుని కొరకైన సంపూర్ణ సమర్పణ విషయంలో ఒక ధృడమైన విశ్వాసం కలిగియుండమని యాకోబు జీవితం మనల్ని ఆహ్వానిస్తుంది. మన క్రియలు ప్రజల దృష్టిని ఆకర్షించేలా కాకుండా క్రీస్తు ఉద్దేశాలను నెరవేర్చే యాకోబు వంటి కదిలించాబడని విశ్వాసాన్ని అనుకరించడానికి మనం కృషి చేయడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/-wTxddCTZkY

40 Days - Day 3.James, Son of Alphaeus : A Martyr-s Testament to Quiet Faithfulness

"So whether you eat or drink or whatever you do, do it all for the glory of God." - 1 Corinthians 10:31

James, son of Alphaeus, is one of the lesser-known apostles, often overshadowed by his namesake, James the son of Zebedee. He may not have a lot of mentions in the New Testament, but his story exemplifies the quiet yet steadfast faith of many unsung heroes in Christianity. 

Despite not having much information about James- actions or words, it is significant that he was chosen by Jesus to be one of His twelve apostles. This speaks volumes about the value Jesus placed on ordinary individuals who answered His call. James had the privilege of being part of Jesus- inner circle, witnessing His miracles, learning from His teachings, and spreading the good news of the Gospel.It-s probable that James- unwavering devotion to Jesus required him to make difficult sacrifices and face countless trials. Just like his fellow apostles, he encountered hostility, skepticism, and uncertainty. But through it all, he continued to faithfully serve his calling, standing shoulder to shoulder with his fellow disciples to spread the message of God-s Kingdom.

Although James- experiences may not have been as flashy or dramatic as those of other apostles, his steadfast commitment in the face of obscurity speaks volumes.  While he was preaching in Jerusalem he was stoned to death by the Jews around 62 AD, and was buried there beside the temple. James serves as a powerful example that every single follower of Christ, regardless of their standing or recognition, has a vital role to play in furthering the work of God-s kingdom.

In a world that often values fame and success, the life of James calls us to embrace humbleness and steadfastness in our dedication to God. Regardless of whether our actions receive mass attention or remain hidden, let us strive to emulate James- unwavering devotion to Christ and His purpose.

English Audio: https://youtu.be/KiCexfM7whg

https://sajeevavahini.com/

Share this post